Andhra Pradesh : వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవంకు ముహుర్తం ఖరారు
వచ్చే నెల (అక్టోబర్)లో వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.
- By Prasad Published Date - 09:50 PM, Tue - 19 September 23

వచ్చే నెల (అక్టోబర్)లో వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ప్రాజెక్టు మొదటి, రెండో టన్నెల్స్‌ను విజయవంతంగా పూర్తి చేశామని, ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. మంగళవారం నంద్యాలలో దోనెలో ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన వెలిగొండ ప్రాజెక్టు ప్రస్తావన తెచ్చారు. ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నాని సీఎం జగన్ తెలిపారు.కాలువ వ్యవస్థలను బలోపేతం చేయడం, రిజర్వాయర్ నిల్వ సామర్థ్యాలను పెంచడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నంద్యాలలో గాజులదిన్నె ప్రాజెక్టును 4.5 టీఎంసీల నుంచి 5 టీఎంసీలకు అప్‌గ్రేడ్ చేశామన్నారు.