TRS: పార్టీ నుంచి వనమా రాఘవ సస్పెన్షన్
- By hashtagu Published Date - 03:41 PM, Fri - 7 January 22

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కేసీఆర్ గారి సూచనమేరకు ఆరోపణలకు గురైన కొత్తగూడెం పార్టీ నాయకులు వనమా రాఘవేంద్రను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఇన్‌ఛార్జి నూకల నరేష్ రెడ్డిలు వెల్లడించారు. ఈ నిర్ణయం తక్షణం అమలులోకి వస్తుందని పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియాతో అన్నారు.