Constable Firing-4 Dead : ట్రాన్స్ ఫర్ చేశారనే కోపంతో రైల్వే కానిస్టేబుల్ ఫైరింగ్.. నలుగురి మృతి
Constable Firing-4 Dead : అతడొక రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ( ఆర్‌పీఎఫ్ ) కానిస్టేబుల్. తనకు గుజరాత్ నుంచి ముంబైకి ట్రాన్స్ ఫర్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
- Author : Pasha
Date : 31-07-2023 - 10:55 IST
Published By : Hashtagu Telugu Desk
Constable Firing-4 Dead : అతడొక రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) కానిస్టేబుల్.
తనకు గుజరాత్ నుంచి ముంబైకి ట్రాన్స్ ఫర్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
ఎంత మనస్తాపం ఉన్నా.. దాన్ని జాబ్ చేసే చోట చూపించకూడదు..
తనకు చాలా దూరం ట్రాన్స్ ఫర్ అయిందనే కోపంతో.. సోమవారం ఉదయం డ్యూటీలో ఉండగా జైపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు (12956)లో తుపాకీతో ఫైరింగ్ కు తెగబడ్డాడు.
దీంతో అక్కడే ఉన్న ఆర్‌పీఎఫ్ ఏఎస్సై తో పాటు ముగ్గురు రైలు ప్రయాణికులు చనిపోయారు.
Also read : Falling From 68th Floor : 68వ అంతస్తు నుంచి పడి చనిపోయిన డేర్ డెవిల్.. ఎక్కడ ?
కాల్పులకు పాల్పడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ను చేతన్ సింగ్ గా గుర్తించారు. వాపి-సూరత్ స్టేషన్ మధ్య ఈ ఘటన జరిగిందని అధికారులు వెల్లడించారు. వెంటనే కానిస్టేబుల్ చేతన్ సింగ్ ను అరెస్టు చేశారు. “మహారాష్ట్రలోని పాల్ఘర్ రైల్వే స్టేషన్ దాటిన తర్వాత కదులుతున్న జైపూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో RPF కానిస్టేబుల్ చేతన్ సింగ్ కాల్పులు(Constable Firing-4 Dead) జరిపాడు. అతను ఒక ASI, ముగ్గురు ప్రయాణికులను కాల్చి చంపాడు. దహిసర్ స్టేషన్ సమీపంలో రైలు నుంచి దూకాడు. అయితే ఆ కానిస్టేబుల్ ను గన్ తో పాటు అదుపులోకి తీసుకున్నారు” అని పశ్చిమ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఆ కానిస్టేబుల్ కొంతకాలంగా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నాడని, మానసికంగా అస్థిరంగా ఉన్నాడని తెలిసింది. నలుగురి మృతదేహాలను పోస్టుమార్టం కోసం కందివాలిలోని శతాబ్ది ఆసుపత్రికి తరలించారు.