Unified Pension Scheme: ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్, 25 సంవత్సరాల సర్వీస్‌పై 50% పెన్షన్
ప్రభుత్వ ఉద్యోగులకు ఏకీకృత పెన్షన్ పథకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద, ఒక ఉద్యోగి 25 సంవత్సరాలు పనిచేసినట్లయితే, అతను పదవీ విరమణకు ముందు ఉద్యోగంలో గత 12 నెలల సగటు జీతంలో 50 శాతం పెన్షన్
- By Praveen Aluthuru Published Date - 09:32 PM, Sat - 24 August 24

Unified Pension Scheme: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఏకీకృత పెన్షన్ పథకానికి కేంద్ర ప్రభుత్వం శనివారం ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం కింద ఒక ఉద్యోగి 25 సంవత్సరాలు పనిచేసినట్లయితే, అతను పదవీ విరమణకు ముందు ఉద్యోగంలో గత 12 నెలల సగటు జీతంలో 50 శాతం పెన్షన్‌గా పొందుతాడు. దాదాపు 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు.
#WATCH दिल्ली: केंद्रीय मंत्री अश्विनी वैष्णव ने कहा, "आज केंद्रीय मंत्रिमंडल ने यूनिफाइड पेंशन स्कीम (UPS) को मंजूरी दे दी है… 50% सुनिश्चित पेंशन, यह इस योजना का पहला स्तंभ है…इसका दूसरा स्तंभ सुनिश्चित पारिवारिक पेंशन है…केंद्र सरकार के लगभग 23 लाख कर्मचारियों को… pic.twitter.com/KBDWG4aK49
— ANI_HindiNews (@AHindinews) August 24, 2024
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధి పొందుతారని సమాచార, ప్రసార, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇప్పుడు ఉద్యోగులు జాతీయ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పిఎస్) మరియు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యుపిఎస్)లలో దేనినైనా ఎంచుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు.
Also Read: Telangana: రైతులను పట్టించుకోని రేవంత్, సీపీఎం భారీ ధర్నాకు పిలుపు