Amit Shah: మోడీ నాయకత్వంతో వ్యాపార, వాణిజ్య రంగాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయి: అమిత్ షా
మోడీ హాయంలోనే భారత్ అన్ని రంగాల్లో దూసుకుపోతోందని అమిత్ షా అన్నారు.
- By Balu J Published Date - 04:16 PM, Fri - 29 September 23

Amit Shah: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా దేశంలో వ్యాపార, వాణిజ్య రంగాలు అభివృద్ధిలో దూసుకెళుతున్నాయని కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా అన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ వార్షికోత్సవ కార్యక్రమంలో కేంద్రమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ… పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం తగిన తోడ్పాటునందిస్తుందన్నారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ రంగాలలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు మధుపరులు ఆసక్తిని చూపిస్తున్నారన్నారు. మోడీ హాయంలోనే భారత్ అన్ని రంగాల్లో దూసుకుపోతోందని అమిత్ షా అన్నారు.
Also Read: KCR Records: ఎన్నికల బరిలో ఓటమి ఎరుగని కేసీఆర్.. గులాబీ బాస్ ట్రాక్ రికార్డు ఇదే