Two Maoists Killed : ఒడిశాలో ఎన్ కౌంటర్.. ఇద్దరు మవోయిస్టులు మృతి
ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ తో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు
- By Prasad Published Date - 07:55 AM, Sat - 12 November 22

ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ తో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరణించిన మవోయిస్టుల నుంచి ఆయుధాలు, గంజాయి, ఇతర మావోయిస్టు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. రామగిరి అటవీ ప్రాంతంలో 20 మంది మావోయిస్టులు ఉన్నారని తమకు సమాచారం అందిందని.. BSF, SOG జవాన్లు కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించారని డీఐజీ రాజేస్ పండిట్ తెలిపారు. ఆ సమయంలో ఎదురు కాల్పులు జరిగాయని.. ఇందులో ఇద్దరు మావోయిస్టులు మరణించారని ఆయన తెలపారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి ఒక టిఫిన్ బాంబు, 3 దేశీయ తుపాకులు, 5 డిటోనేటర్లు, మొబైల్ ఛార్జర్, మావోయిస్టు యూనిఫాంలు, 10 సీల్డ్ గంజాయి ప్యాకెట్లు మరియు ఇతర మావోయిస్టు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.