Twitter Employees: ట్విట్టర్ ఉద్యోగుల బోనస్ కిరికిరి
ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ పై ఆ కంపెనీలో పని చేసే ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉద్యోగులకు అందించాల్సిన బోనస్ లు ఇంకా ఇవ్వలేదంటూ ఆరోపిస్తున్నారు.
- By Praveen Aluthuru Published Date - 07:26 PM, Wed - 21 June 23

Twitter Employees: ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ పై ఆ కంపెనీలో పని చేసే ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉద్యోగులకు అందించాల్సిన బోనస్ లు ఇంకా ఇవ్వలేదంటూ ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ట్విట్టర్‌పై ఉద్యోగులు దావా వేశారు. 2022 ఏడాది బోనస్‌లు ఇవ్వడంలో కంపెనీ విఫలమైందని ఇప్పటికే ఫెడరల్ కోర్టులో పిటిషన్ వేశారు. నిజానికి ట్విట్టర్ సంస్థ సంవత్సరానికి బోనస్‌ను చెల్లిస్తుంది. అయితే ట్విట్టర్ ని మస్క్ చేజిక్కించుకున్న తరువాత బోనస్ చెల్లిస్తామని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు. కానీ ఈనాటికి బోనస్ లు ఇవ్వలేదని చెప్తున్నారు ఉద్యోగులు. ఇదిలా ఉండగా ఒకప్పుడు 7,500 మంది ఉద్యోగులను కలిగి ఉన్న మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ఇప్పటివరకు 75 శాతం కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించింది. దీంతో మస్క్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ట్విట్టర్ పై అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పటికే ట్విట్టర్ పై కాపీరైట్ ఉల్లంఘన కేసు నమోదైంది.
Read More: Video Viral: ఏం టెక్నాలజీ గురు.. డ్రైవర్ లేకుండానే నడుస్తున్న టాక్సీ?