Anchor Swetcha: టీవీ యాంకర్ స్వేచ్చ ఆత్మహత్య!
ఆమె తల్లి శ్రీదేవితో కలిసి రామ్‌నగర్‌లో నివసిస్తోంది. సమాచారం అందుకున్న చిక్కడపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.
- By Gopichand Published Date - 11:23 PM, Fri - 27 June 25

Anchor Swetcha: హైదరాబాద్‌లోని రామ్‌నగర్‌లో టీ న్యూస్ ఛానెల్‌లో యాంకర్‌గా పనిచేస్తున్న స్వేచ్చ (Anchor Swetcha) (40) శుక్రవారం తన నివాసంలో ఆత్మహత్య చేసుకుంది. ఆమె తల్లి శ్రీదేవితో కలిసి రామ్‌నగర్‌లో నివసిస్తోంది. సమాచారం అందుకున్న చిక్కడపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. స్వేచ్చ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు.
Also Read: Amit Shah : నిజామాబాద్‌లో పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు
స్వేచ్చ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. పోలీసులు ఆమె కుటుంబ సభ్యులు, సహోద్యోగులతో సంప్రదింపులు జరుపుతూ ఆమె మానసిక స్థితి, వ్యక్తిగత జీవితంపై ఆరా తీస్తున్నారు. స్థానికులు, సహోద్యోగులు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, మరిన్ని వివరాల కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నారు.