TDP Leader: వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ అవినీతిమయమైంది!
- Author : Balu J
Date : 30-05-2024 - 11:58 IST
Published By : Hashtagu Telugu Desk
TDP Leader: తప్పులు చేసినోళ్లు ఏపీ వదిలి వెళ్లేందుకు సిద్ధమయ్యారని తెదేపా నేత ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడున్నా తితిదే ఈవో ధర్మారెడ్డి జైలుకెళ్లడం ఖాయమన్నారు. బోర్డు సమావేశాల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో ఎందుకు పెట్టించలేదని ఛైర్మన్ కరుణాకర్‌రెడ్డిని ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో తితిదే పూర్తిగా అవినీతిమయమైందని ఆరోపించారు.
తితిదే ప్రతాలు, కంప్యూటర్ల ధ్వంసానికి కుట్రలు చేస్తున్నారన్నారు. తెదేపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని ఆనం వెంకటరమణారెడ్డి చెప్పారు. కాగా ఏపీ ఏన్నికల కౌంటింగ్ సమయం దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలో రాజకీయ వేడి నెలకొంది. ఇటు వైసీపీ, అటు టీడీపీ కూటమి నాయకులు పరస్పర ఆరోపణలతో రాజకీయాలను మరింత హీటెక్కిస్తున్నారు. వ్యక్తిగత సర్వేలు తెప్పించుకొని, రివ్యూలు చేసుకొని గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.