TTD : ఫిబ్రవరి కోటా దర్శనం టోకెన్ల విడుదలకు షెడ్యూల్ విడుదల చేసిన టీటీడీ
తిరుమల తిరుపతి దేవస్థానం ఫిబ్రవరి 2024 నెలలో వివిధ సేవల దర్శన టిక్కెట్ల విడుదల షెడ్యూల్‌ను ప్రకటించింది. షెడ్యూల్
- Author : Prasad
Date : 18-11-2023 - 2:29 IST
Published By : Hashtagu Telugu Desk
తిరుమల తిరుపతి దేవస్థానం ఫిబ్రవరి 2024 నెలలో వివిధ సేవల దర్శన టిక్కెట్ల విడుదల షెడ్యూల్‌ను ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం.. శ్రీవారి ఆర్జిత సేవ (కల్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ) టిక్కెట్లను టీటీడీ విడుదల చేస్తుంది. ఫిబ్రవరి నెల 21వ తేదీ ఉదయం 10 గంటలకు వర్చువల్ ఆర్జిత (కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ) సేవల టిక్కెట్లను ఈ నెల 21న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. ఈ నెల 23న ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీవారి అంగప్రదక్షిణ టిక్కెట్లను, ఈ నెల 23న వృద్ధులు, వికలాంగులకు టోకెన్లను కూడా టీటీడీ విడుదల చేయనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రూ.300/- ప్రత్యేక దర్శనం టిక్కెట్ల కోటాను ఈ నెల 24న విడుదల చేయనుంది. ఈ నెల 25న తిరుపతిలోని గదుల కోటా, 26న తిరుమలలోని గదుల కోటా టికెట్లు విడుదల చేయనుంది.