TTD EO Son Dies: టీటీడీ ఈవో కుమారుడు మృతి
టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు (TTD EO son) చంద్రమౌళి(28) గత మూడు రోజులుగా చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో ECMO ఆధారిత చికిత్స పొందుతూ మృతి చెందాడు. జనవరిలో వివాహం జరగాల్సిన చంద్రమౌళి మృతి చెందడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.
- Author : Gopichand
Date : 21-12-2022 - 12:28 IST
Published By : Hashtagu Telugu Desk
టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు (TTD EO son) చంద్రమౌళి(28) గత మూడు రోజులుగా చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో ECMO ఆధారిత చికిత్స పొందుతూ మృతి చెందాడు. జనవరిలో వివాహం జరగాల్సిన చంద్రమౌళి మృతి చెందడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. కావేరి ఆసుపత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అరవిందన్ సెల్వరాజ్ చంద్రమౌళి మృతిపై ప్రకటన చేశారు. ఆయన్ను బ్రతికించేంందుకు వైద్యులు శాయశక్తులా కృషి చేసినా ఫలితం లేకపోయిందని తెలిపారు.
కాగా, చంద్రమౌళికి ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. జనవరిలో వీరి వివాహం తిరుమలలో జరగాల్సి ఉంది.ధర్మారెడ్డి తనయుడు చంద్రమౌళికి టీటీడీ చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షుడు ఏజే శేఖర్ రెడ్డి కుమార్తెతో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. జనవరిలో తిరుమలలో పెళ్లికి ముహూర్తం ఖరారు కాగా.. ఆదివారం చెన్నైలోని ఆళ్వారుపేటలో బంధువులకు చంద్రమౌళి పెళ్లి కార్డులు పంపిణీ చేస్తున్నారు. కొద్దిసేపటి తర్వాత తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వెంటనే సమీపంలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించారు. మరికొద్ది రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా చంద్రమౌళి మృతితో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.