TTD Electric Bus Thefted : తిరుమల శ్రీవారి బస్సు చోరీ..!
TTD Electric Bus Thefted తిరుపతిలో శ్రీవారి చిత్ర ధర్మ రథం ఎలట్రిక్ బస్సు చోరీ జరిగింది. ఓ పక్క తిరుమలలో బ్రహ్మోత్సవాలు
- Author : Ramesh
Date : 24-09-2023 - 2:50 IST
Published By : Hashtagu Telugu Desk
TTD Electric Bus Thefted తిరుపతిలో శ్రీవారి చిత్ర ధర్మ రథం ఎలట్రిక్ బస్సు చోరీ జరిగింది. ఓ పక్క తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతుండగా అధికారులంతా కూడా ఆ పనుల్లో ఉన్నారు. ఇదే కరెక్ట్ టైం అనుకున్న దొంగలు చిన్నా చిన్న వస్తులు కాదు ఏకంగా బస్సునే తీసుకెళ్లిపోయారు. శనివారం రాత్రి చార్జింగ్ స్టేషన్ వద్ద బస్సుకి చార్జింగ్ పెట్టి అతను బయటకు వెళ్లాడు. అయితే ఇదే కరెక్ట్ టైం అనుకున్న దొంగలు బస్సుని చోరీ చేశారు.
బస్సు కనిపించట్లేదని అధికారులకు సమాచారం ఇవ్వగా పోలీసులు రంగంలోకి దిగి మిస్సన బస్సు కోసం గాలింపు చేయడం మొదలు పెట్టారు. ఎలక్ట్రిక్ బస్సులకు జిపిఎస్ లొకేషన్ ఉంటుంది కాబట్టి దాని ఆధారంగా అది తిరుపతి దగ్గరలో ఉన్న నాయుడు పేట వద్ద ఉన్నట్టు గుర్తించారు. బస్సులో చార్జింగ్ అయిపోవడం వల్ల దొంగలు ఆ బస్సుని అక్కడే ఉంచి పరారైనట్టు తెలుస్తుంది.
ఆదివారం ఉదయం 3:53 గంటలకు బస్సు నాయుడు పేట బైపాస్ దగ్గర వదిలి దుండగులు వెళ్లిపోయారు. 2 కోట్ల విలువల కలిగిన ఈ ఎలక్ట్రిక్ బస్సు చోరీ తిరుమల లో ప్రధాన హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిండితుడిని గుర్తించే పనుల్లో ఉన్నారు.
బస్సుని దొంగిలించి (TTD Electric Bus Thefted ) వెళ్తున్నా టోల్ గేట్ దగ్గర ఆపాల్సి ఉంటుంది. కానీ అక్కడ టోల్ అధికారులు కూడా దాన్ని వదిలిపెట్టడం అనుమానంగా మారింది. తిరుమలలో బ్రహ్మోత్సవాల సందడి జరుగుతున్న టైం లో శ్రీవారి బస్సు చోరీకి గురవడం భక్తులకు షాక్ ఇచ్చింది. తిరుమలలో భక్తులు ఎంత శ్రద్ధగా ఉన్నా దొంగలు తమ పని తాము చేసుకుంటూ వెళ్తారు. అయితే అధికారులు ఎంత కట్టిదిట్టమైన చెకింగ్ పాయింట్స్ పెట్టినా సరే ఇలాంటి సంఘటనలు రిపీట్ అవుతూనే ఉన్నాయి.
Also Read : Myra Vaikul Video Viral: నా గణపయ్యని తీసుకెళ్లొద్దు: చిన్నారి ఏడుపు