HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Trump Comments Russia Ukraine War Drone Attack 2025

Trump: రష్యా-ఉక్రెయిన్‌ వార్‌.. మీరు చిన్న పిల్లలా అంటూ ట్రంప్ వ్యాఖ్య

Trump: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నాలుగేళ్లుగా కొనసాగుతుండగా, ప్రపంచ దేశాల ప్రయత్నాలు ఇప్పటివరకు పెద్దగా ఫలితాన్నివ్వలేకపోయాయి.

  • Author : Kavya Krishna Date : 06-06-2025 - 11:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Donald Trump
Donald Trump

Trump: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నాలుగేళ్లుగా కొనసాగుతుండగా, ప్రపంచ దేశాల ప్రయత్నాలు ఇప్పటివరకు పెద్దగా ఫలితాన్నివ్వలేకపోయాయి. ఈ యుద్ధాన్ని ఆపేందుకు అనేక అంతర్జాతీయ నాయకులు చర్చలు జరిపినప్పటికీ, సంతృప్తికర పరిష్కారం దొరకలేదు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా యుద్ధాన్ని ఆపేందుకు రష్యా, ఉక్రెయిన్ నేతలతో చర్చలు జరిపారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదని, దీంతో అమెరికా ఈ సమస్యపై విసుగుతో ఉంది.

తాజాగా ఈ యుద్ధంపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని చిన్న పిల్లల మధ్య జరిగే గొడవలతో పోల్చారు. “వాళ్లు చిన్న పిల్లల్లా కొట్టుకుంటున్నారు.. కొంతకాలం అలాగే ఉంచితేనే శాంతి ఎలా వస్తుందో తెలుస్తుంది,” అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, ప్రపంచంలో యుద్ధాన్ని ఆపగల శక్తి తనకే ఉందని చెబుతూ, జర్మన్ ఛాన్సలర్ మెర్జ్ చేసిన ప్రశంసలను స్వీకరించారు.

HYDRAA : బేగంపేట, ప్యాట్నీ సెంటర్ లలో హైడ్రా కూల్చివేతలు..భారీగా ట్రాఫిక్ జాం

ట్రంప్, జర్మనీ కొత్త ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ మధ్య వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌లో జరిగిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ, “ఈ యుద్ధం ద్వేషంతో పోరాడే చిన్న పిల్లల మాదిరిగా ఉంది. నేను పుతిన్‌కి ఫోన్‌ చేసి కూడా ఇదే చెప్పాను. అయితే, నేను అంతగా జోక్యం చేయలేను. జర్మనీ కూడా ఈ సమస్య పరిష్కారంలో పాత్ర పోషించాలి,” అని సూచించారు.

ఈ క్రమంలో అమెరికా మధ్యవర్తిగా సౌదీ అరేబియాలో రష్యా అధికారులతో చర్చలు కూడా చేపట్టింది. అయితే ఆ చర్చల సమయంలో రష్యా కొన్ని షరతులు పెట్టడంతో చర్చలు స్తబ్ధతకు చేరాయి. తాజా పరిణామాల్లో, ఇస్తాంబుల్‌లో మరోసారి చర్చలు మొదలయ్యేందుకు సిద్ధమైన వేళ, ఉక్రెయిన్ ఆకస్మికంగా రష్యా పై డ్రోన్ దాడులు జరిపింది. ఈ దాడుల్లో రష్యా వైమానిక స్థావరాలపై తీవ్ర నష్టం జరిగినట్టు తెలుస్తోంది. అనేక బాంబర్లను ఉక్రెయిన్ ధ్వంసం చేసినట్టు సమాచారం. అయితే ఇప్పటివరకు రష్యా నుంచి ప్రతీకార దాడి చేపట్టలేదు. ఈ పరిణామాలతో యుద్ధ పరిస్థితి మరింత సంక్షోభంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

Talliki Vandanam : విద్యార్థులు ఈ పత్రాలు అందజేస్తేనే తల్లికి వందనం డబ్బులు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Donald Trump
  • Drone Attack
  • Frederick Merz
  • Istanbul Talks
  • Russia-Ukraine War
  • Trump Comments
  • ukraine
  • US Mediation
  • Vladimir Putin
  • world news

Related News

Donald Trump

Donald Trump: ఇరాన్ డీల్‌ విషయంలో ఒప్పందానికి తొందరేం లేదు: ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో శాంతి చర్చలపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో ఒప్పందం దాదాపు పూర్తయిందని ఆదివారం ప్రకటించిన ఆయన, తాజాగా ఆ మాటకు భిన్నంగా మాట్లాడారు. ఒప్పందం ఇంకా చర్చల దశలోనే ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్’లో ఓ పోస్ట్ చేశారు. “చర్చలు సక్రమంగానే సాగుతున్నాయి. కానీ ఒప్పందం విషయంలో తొందరపడబోము. చ

    Latest News

    • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

    • TDP : టీడీపీ చూపిన బాటలో దేశ రాజకీయాలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి

    • T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

    • CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

    • HYDRAA : పుప్పలగూడ‌ ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్..

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd