HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Hydra Demolitions In Begumpet And Patni Centers

HYDRAA : బేగంపేట, ప్యాట్నీ సెంటర్ లలో హైడ్రా కూల్చివేతలు..భారీగా ట్రాఫిక్ జాం

HYDRAA : బేగంపేట నాలా పరివాహక ప్రాంతంలో నివాస భవనాలు, గోడలు, వాణిజ్య స్థలాలపై చేపట్టిన ఈ కూల్చివేతలు భారీగా ప్రజల్లో చర్చనీయాంశమయ్యాయి

  • Author : Sudheer Date : 06-06-2025 - 9:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Demolition Of Illegal Struc
Demolition Of Illegal Struc

సికింద్రాబాద్ పరిధిలోని బేగంపేట, ప్యాట్నీ సెంటర్ పరిసరాల్లో నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలపై(Illegal Structures) హైడ్రా అధికారులు కొరడా ఝుళిపించారు. నాలా వెడల్పు తగ్గిపోయి వర్షాకాలంలో వరదలు కాలనీల్లోకి వస్తున్నాయని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు అధికారులు శుక్రవారం ఉదయం నుంచి బుల్డోజర్లతో ఆక్రమణల తొలగింపు పనులు ప్రారంభించారు.

Kidney Stones : అసలు కిడ్నీలో రాళ్లు ఎందుకు ఏర్పడతాయి..? వాటి లక్షణాలు, నివారణ చిట్కాలు ఏంటి…?

బేగంపేట నాలా పరివాహక ప్రాంతంలో నివాస భవనాలు, గోడలు, వాణిజ్య స్థలాలపై చేపట్టిన ఈ కూల్చివేతలు భారీగా ప్రజల్లో చర్చనీయాంశమయ్యాయి. అక్రమ కట్టడాల వల్ల నాలా మూసివేయబడటంతో భారీ వర్షాలు వచ్చినప్పుడు నీరు వెళ్ళే మార్గం లేక జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నది. దీంతో నివాసితులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు చేపట్టిన ఈ చర్య వల్ల వరదల ప్రభావం తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Bengaluru Stampede: ఆర్సీబీకి మరో బిగ్ షాక్.. వారిని అరెస్ట్ చేయాలని సీఎం ఆదేశాలు!

అయితే ఈ పనులు ట్రాఫిక్‌కు మాత్రం తాత్కాలికంగా భారంగా మారాయి. బేగంపేట, ప్యాట్నీ, రాణిగంజ్ వంటి ప్రధాన కూడళ్లలో ఉదయం నుండి వాహనాల రద్దీ పెరిగింది. ట్రాఫిక్ పోలీస్‌లు దారులు మళ్లించి వాహనదారులకు సహాయం చేస్తున్నారు. అధికారుల ప్రకారం, ఈ కూల్చివేతలతో నాలా శుభ్రం అయి వర్షాకాలంలో ముంపు సమస్యలకు స్థిర పరిష్కారం లభించనుంది. కాగా గురువారం అల్వాల్‌లోని చిన్నరాయుని చెరువులో ఆక్రమణలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఉదయాన్నే బుల్డోజర్లు, ఎక్స్‌కావేటర్లతో చిన్నరాయుని చెరువు వద్దకు చేరిన హైడ్రా సిబ్బంది చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో అక్రమంగా నిర్మించిన భవనాలను నేలమట్టం చేశారు. ఈ క్రమంలో నిర్మాణదారులకు, హ్రైడా అధికారులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులు మోహరించారు. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో భవన నిర్మాణాలపై స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో కూల్చివేతలు చేపట్టారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Begumpet
  • demolition
  • HYDRAA
  • illegal construction complaint
  • patny centre

Related News

Even though KTR got entangled in his own challenge, Revanth Reddy gained the upper hand over BRS!

Cm Revanth Reddy: తన సవాలులో తానే చిక్కుకున్న KTR.. BRS పై పైచేయి సాధించిన రేవంత్ రెడ్డి!

ధైర్యవంతమైన మరియు నిర్ణయాత్మక నాయకత్వంతో, కాళేశ్వరం ప్రాజెక్ట్ వైఫల్యంపై చర్చించేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ప్రకటించడం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, KTRను మరియు మొత్తం BRSను ఇబ్బందుల్లో పడేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా ఉంటుందని భావించి సవాలు విసిరిన అహంకారి KTR, ఇప్పుడు తప్పించుకునే మార్గాల కోసం నానా తంటాలు పడుతున్నారు. అసెంబ్లీలో గంభీరమైన చర్చకు బదులు

  • High Court takes a serious view of the Owaisi educational institution!

    Owaisi college: ఒవైసీ విద్యాసంస్థపై హైకోర్టు సీరియస్!

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd