HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Trs Preparing For The Parliament Meetings Kcr Will Give Direction To Trs Mps

CM KCR: పార్లమెంట్ ఫైట్ కు టీఆర్ఎస్ సిద్ధం!

ఈ నెల 18 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభంకానున్నాయి.

  • Author : Balu J Date : 15-07-2022 - 11:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cm Kcr
Cm Kcr

ఈ నెల 18 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ఉభయ సభల్లో టీఆర్ఎస్ అనుసరించాల్సిన విధివిధానాలపై  సీఎం దిశానిర్దేశం చేసేందుకు (రాజ్యసభ, లోక్ సభ) సభ్యులతో శనివారం ప్రగతిభవన్ లో సమావేశం కానున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల పై పోరాడాలని ఎంపీలకు కేసీఆర్ సూచించే అవకాశాలున్నాయి. లోక్ సభ రాజ్యసభల్లో టిఆర్ఎస్ ఎంపీలు అవలంబించవలసిన పలు కీలక అంశాలపై ముఖ్యమంత్రి  దిశానిర్దేశం చేయనున్నారు.  తెలంగాణకు అన్ని రంగాల్లో నష్టం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తెలంగాణ ప్రజా వ్యతిరేక విధానాలను దనుమాడుతూ పార్లమెంటు ఉభయసభల్లో తీవ్ర నిరసనను ప్రకటిస్తూ, పార్లమెంటు వేదికగా పోరాటానికి సిద్ధమయ్యేలా కేసీఆర్ కార్యాచరణ రూపొందించనున్నారు.

చర్చించే అంశాలివే..

• ఆర్ధికంగా క్రమశిక్షణను పాటిస్తూ అనతి కాలంలో అభివృద్ధి పథంలో పయనిస్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రోత్సహించాల్సింది పోయి ఆర్థింకగా అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేయాలని కేంద్రం కుటిల ప్రయత్నాలు చేస్తుండడం పట్ల తెలంగాణ ప్రజా ఆకాంక్షలను అద్దం పడుతూ ఉభయ సభల్లో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని ఎంపీలకు సిఎం కెసిఆర్ సూచించనున్నారు.

• వ్యవసాయం, సాగునీరు, తదితర వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక కార్యాచరణ తో అనతికాలంలోనే అందరి అంచనాలను మించి, ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే ముందంజలో తెలంగాణ నిలిచింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనకుండా, రైతులను మిల్లర్లను ప్రభుత్వాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల పై పోరాడాలని ఎంపీలకు, సిఎం పిలుపునివ్వనున్నారు.

• గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తున్న తెలంగాణ విషయంలో కేంద్రం పొంతనలేని ద్వంద్వం వైఖరిని, దుర్మార్గ విధానాన్ని నిలదీయాలని సిఎం నిర్ణయించారు. తెలంగాణ లో గ్రామీణ ఉపాధి హామీ పథకం గొప్పగా అమలు జరుగుతున్న తీరు గురించి, రాష్ట్రంలో జరుగుతున్న సోషల్ ఆడిట్ గురించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలుమార్లు ప్రశంసించింది, అవార్డులు ఇచ్చింది. కానీ, నేడు కేంద్ర ప్రభుత్వం మాట మార్చి తద్విరుద్దంగా వ్యవహరిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నగ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురిచేయాలనే కేంద్రం కుట్రపూరిత ధోరణుల పట్ల పార్లమెంటు వేదికగా నిలదీయాలని ఎంపీలకు సిఎం సూచించనున్నారు.

• ఇతర రంగాల్లోనే కాంకుడా ఆర్థిక రంగంలో కూడా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అసంబద్ధ విధానాల వల్ల, రోజు రోజుకూ దేశ ఆర్థిక వ్యవస్థ పతనమౌతున్నదని ఆర్థిక వేత్తలు ఆందోళన చెందుతున్నారు. క్షీణిస్తున్న రూపాయి విలువే అందుకు నిదర్శనంగా దేశ ప్రజలు భావిస్తున్నారు. దేశ అభివృద్ధి సూచి రోజు రోజుకూ పాతాళానికి చేరుకుంటున్న ప్రమాదకరపరిస్థితుల్లో దేశాన్ని ఆర్థిక సంక్షోభం భారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత దేశ పౌరులుగా తెలంగాణ ప్రజలకున్నదని సిఎం కెసిఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగా ప్రజాభిప్రాయం ప్రతిబింబించేలా రూపాయి పతనం పై కేంద్రాన్ని ఉభయ సభల సాక్షిగా నిలదీయాలని సిఎం కెసిఆర్ ఎంపీలకు సూచించనున్నారు. పాలనలోనే కాకుండా రాజకీయ, సామాజిక తదితర అన్ని రంగాల్లో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక ఆధిపత్యధోరణి వల్ల దేశంలో రోజు రోజుకూ ప్రజాస్వామిక విలువలు దిగజారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాంతో పరమత సహనం, శాంతి,సౌభ్రాతృత్వం ఫరిఢవిల్లాల్సిన దేశంలో అశాంతి ప్రబలే సూచనలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. రాజ్యాంగం పొందుపరిచిన ఫెడరల్ స్పూర్తికి, సెక్యులర్ జీవన విధానానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న దుర్మార్గ విధానాలు గొడ్డలిపెట్టుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను నిరసిస్తూ పార్లమెంటు వేదికగా దేశ ప్రజల ఆకాంక్షలను చాటేలా గొంతు విప్పాలని, టిఆర్ఎస్ ఎంపీలకు సిఎం కెసిఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

• కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న పోరాటంలో భాగంగా, కలిసివచ్చే ఇతర రాష్ట్రాల విపక్ష ఎంపీలను కూడా కలుపుకుపోతూ, కేంద్రం మెడలు వంచి ప్రజాస్వామిక విలువలు కాపాడాల్సి వున్నదిని సిఎం అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలు దేశ ప్రజల తరఫున టిఆర్ఎస్ రాజ్యసభ, లోక్ సభ ఎంపీలు పార్లమెంటు ఉభయ సభల్లో బిజెపి కేంద్ర ప్రభుత్వ అసంబద్ధ విధానాలను నిలదీస్తూ గళం విప్పాలని సిఎం కెసిఆర్ రేపటి సమావేశంలో ఎంపీలకు పిలుపునివ్వనున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm kcr
  • pragathi bhavan
  • telangana
  • TRS Mps

Related News

Uttam Kumar Reddy

శాస్త్ర‌వేత్త‌ల‌తో స‌మావేశ‌మైన మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి!

తెలంగాణ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని, తద్వారా రైతు ఆర్థికంగా బలోపేతం కావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

  • Zaheerabad

    తెలంగాణ లో మరో నగరం రియల్ హాట్ స్పాట్ గా మారబోతుంది !!

  • bjp Mp Godam Nagesh

    తెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్టు.. మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిని విడుదల చేసిన ఎంపీ నగేష్

  • Rajya Sabha Elections

    Breaking News రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

  • Engineering Students Telang

    Engineering Students : ప్రైవేటు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కు బిగ్ షాక్..భారీగా పెరిగిన ఫీజులు

Latest News

  • హై వోల్టేజ్ యాక్షన్ మోడ్‌లోకి శర్వానంద్!

  • ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి..ఆ తర్వాత సావిత్రి లెవల్లో నటించిన భార్య

  • Honey Trap : కోడిపెట్టను ఎరగా వేసి పుంజు ఎత్తుకెళ్లారు..వీళ్లు మాములు కిలాడీలు కాదు !!

  • Good News : సామాన్యులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న వంటనూనె ధరలు?

  • Carrot and Beetroot Prices : భారీగా తగ్గిన క్యారెట్, బీట్రూట్ ధరలు

Trending News

    • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

    • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

    • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

    • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

    • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd