MLC Kavitha: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత
- By HashtagU Desk Published Date - 10:05 AM, Fri - 18 February 22

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదినాన్ని పురస్కరించుకొని ఆపార్టీ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరియు అనిల్ దంపతులు నేడు శ్రీవారి నిజపాద దర్శనం సేవలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం స్వామివారికి జరిగే నిజపాదసేవలో, శ్రీవారిని దర్శించికొని, మొక్కులు చెల్లించుకున్నారు. ఇక గురువారం కవిత దంపతులు ఆమె అలిపిరి నడకమార్గం ద్వారా తిరుమలకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆలయ అధికారులు కవిత దంపతులకు దర్శన ఏర్పాట్లు చేసి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులచేత ఆశీర్వచనం అందించి, స్వామి వారి పట్టు వస్త్రాలను అందజేశారు.
కుటుంబ సమేతంగా కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని నిజపాదసేవలో దర్శించుకుని,మొక్కులు చెల్లించుకున్నాను.. ఏడు కొండల స్వామివారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుందాం.. pic.twitter.com/v8isRG3NJc
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 18, 2022