Party Assets : గులాబీ ‘కారు’ చాలా రిచ్ గురూ!
తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ధనిక పార్టీగా టీఆర్ఎస్ ఉంది. ఆ పార్టీకి 301.47 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని ఏడీఆర్ నివేదిక తేల్చింది. దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో అత్యధిక రెండో రిచ్ పార్టీ గా టీఆర్ఎస్ ఉంది.
- By Hashtag U Published Date - 07:43 PM, Fri - 28 January 22

తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ధనిక పార్టీగా టీఆర్ఎస్ ఉంది. ఆ పార్టీకి 301.47 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని ఏడీఆర్ నివేదిక తేల్చింది. దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో అత్యధిక రెండో రిచ్ పార్టీ గా టీఆర్ఎస్ ఉంది. ప్రాంతీయ పార్టీల్లో అత్యధిక అప్పులు ఉన్న పార్టీ గా టీడీపీ ఉండటం గమానార్హం. ఆ పార్టీ అప్పుల విలువ రూ.30.342 కోట్లుగా లెక్కించారు. రూ.8.05 కోట్ల అప్పుతో డీఎంకే రెండోస్థానంలో అప్పుల్లో ఉంది.
ఇక ఆస్తులు బాగా ఉన్న ప్రాంతీయ పార్టీల్లో మొదటి స్థానం ఎస్పీది.
సమాజ్ వాదీ పార్టీకి అత్యధికంగా రూ.563.47 కోట్ల ఆస్తులు ఉన్నట్టు వెల్లడైంది. ఆ తర్వాతి స్థానంలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఉంది. బీఎస్పీకి ఆస్తుల విలువ రూ.698.33 కోట్లు కాగా, రూ.267.61 కోట్లతో అన్నాడీఎంకే పార్టీ మూడోస్థానంలో ఉంది. ఫిక్స్ డ్ డిపాజిట్లు, రుణాలు, ముందస్తు చెల్లింపులు, పెట్టుబడులు, ఇతరత్రా వివరాల ప్రాతిపదికన ఈ ఆస్తుల విలువ లెక్కకట్టారు.
జాతీయ పార్టీల అప్పుల విషయానికొస్తే… కాంగ్రెస్ అగ్రభాగాన నిలుస్తుంది. హస్తం పార్టీకి రూ.49.55 కోట్ల అప్పులున్నాయట. తర్వాత స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ (రూ.11.32 కోట్లు) ఉంది. దేశంలోని ఏడు జాతీయ పార్టీలు, 44 ప్రాంతీయ పార్టీల ఆస్తులు, అప్పుల వివరాలను అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. 2019-2020 ఆర్థిక సంవత్సరానికి గాను అన్ని పార్టీల్లోకి బీజేపీకి అత్యధికంగా రూ.4,847.78 కోట్ల మేర ఆస్తులు ఉన్నట్టు వెల్లడైంది. జాతీయ పార్టీల మొత్తం ఆస్తుల విలువలో ఇది 69.37 శాతం. అన్ని పార్టీల ఆస్తుల విలువను వెల్లడించింది.