Mystery Solved : ట్రిపుల్ డెత్ కేసులో వీడిన మిస్టరీ.. ముందుగా చెరువులో దూకింది శృతి.. ఆ తరువాత
Mystery Solved : కామారెడ్డి జిల్లాలో కలకలం సృష్టించిన భిక్కనూరు ఎస్‌ఐ సాయికుమార్, బీబీ పేట కానిస్టేబుల్ శ్రుతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతి ఘటన ఎట్టకేలకు మిస్టరీ వీడింది. అడ్లూర్ యల్లారెడ్డి చెరువులో మునిగి ముగ్గురు మృతి చెందినట్లు ప్రాథమిక పోస్టుమార్టం నివేదికలు వెల్లడిస్తున్నాయి.
- By Kavya Krishna Published Date - 01:06 PM, Sat - 28 December 24

Mystery Solved : తెలంగాణలో సంచలనం సృష్టించిన ట్రిపుల్ డెత్ కేసు ఆధారంగా ఇప్పటికీ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో బీబీపేట మహిళా కానిస్టేబుల్ శృతి, భిక్కనూర్ ఎస్ఐ సాయి కుమార్, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ముగ్గురు అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో మునిగి మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, వారి మరణాలకు కారణాలపై మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ముగ్గురి మరణాలపై సంబంధించిన దర్యాప్తులో ఎన్నో సందిగ్ధాలు నెలకొన్నాయి. ఫోన్లు లాక్ ఓపెన్ కాకపోవడం, ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన వారు లేకపోవడం దర్యాప్తును ఇంకా కష్టతరం చేసింది.
అయితే.. మృతుల కుటుంబ సభ్యులు, స్నేహితులు, వారితో పనిచేసిన సిబ్బందిని విచారించడం ప్రారంభించగా, కొన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల ప్రకారం, ముగ్గురు మరణించిన రోజు ఫోన్లలో గంటల తరబడి మాట్లాడిన సమాచారాన్ని గుర్తించారు పోలీసులు. శృతి, నిఖిల్ ల మధ్య వాట్సాప్‌లో ఆత్మహత్యకు సంబంధించి చర్చ జరిగినట్లు సమాచారం అందింది.
Tirumala Srivaru: నవంబర్ నెలలో తిరుమల శ్రీవారిని ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా?
శృతి, సాయి కుమార్, నిఖిల్ మధ్య సంబంధాలు వివాదాస్పదంగా మారాయి. శృతి, వయోపరంగా విడాకులు తీసుకుని ఒంటరిగా ఉన్నా, ఆమె వివాహేతర సంబంధాన్ని సాయి కుమార్‌తో ప్రారంభించింది. కానీ శృతి, ముందుగా నిఖిల్‌తో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్నట్లు సమాచారం ఉంది. ఈ విషయాన్ని తెలుసుకున్న సాయి కుమార్ తన శృతిని, నిఖల్‌ను నిలదీశాడు. దీంతో ఆత్మహత్యకు సంబంధించిన ఘటన అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో చోటు చేసుకుంది.
ఈ క్రమంలో శృతి, నిఖిల్, సాయి కుమార్ మధ్య మాటా మాటా పెరిగి పెద్దపాటి వివాదానికి దారితెలియగా, ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. శృతి మొదటగా చెరువులో దూకినట్లు భావిస్తున్న అధికారులు, ఆ తర్వాత నిఖిల్ కూడా దూకడంతో, ఆందోళనలో ఉన్న సాయి కుమార్ కూడా ఆత్మహత్య చేసుకున్నారని భావిస్తున్నారు. ఇకపై మరిన్ని ఆధారాలు వెలుగులోకి రాగలవని, ఈ కేసు విషయంలో పూర్తిస్థాయిలో విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.
TGSRTC : ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ బస్సులు ఎన్నంటే..!