HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Top 3 Actors Who Are Charging Over 120cr Per Film

TOP 3 Indian Actors: ఒక్క సినిమాకు వందకోట్లు తీసుకుంటున్న స్టార్స్ వీళ్లే!

ఇండియన్ సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకుంటోంది.

  • Author : Balu J Date : 08-07-2022 - 4:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cinema
Cinema

ఇండియన్ సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకుంటోంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించాయి. హాలీవుడ్ హీరోలకు ధీటుగా రాణించి ఐ యామ్ ఇండియన్ అంటూ గర్వపడేలా చేస్తున్నారు. కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాల తర్వాత ఆదిపురుష్, పఠాన్, కభీ ఈద్ కభీ దీపావళి, టైగర్ 3, రామ్ సేతు వంటి భారీ ప్రాజెక్టులు శరవేగంగా షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. అయితే భారీ ప్రాజెక్టుల్లో నటిస్తున్న స్టార్స్ తమ రెమ్యునరేషన్ కూడా భారీగా ఆశిస్తున్నారు. రాబోయే సినిమాల కోసం 120 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్న ఈ ముగ్గురు స్టార్స్ గురించి తెలుసుకుంటే కచ్చితంగా షాక్ అవుతారు.

ప్రభాస్

వర్షం, ఛత్రపతి, మిర్చి లాంటి సినిమాలతో ప్రభాస్ మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత బాహుబలితో ఒక్కసారిగా పాన్ హీరో అయ్యాడు. ఇటీవల రాధే శ్యామ్‌ ఆకట్టుకుంటున్న ప్రభాస్ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అతిపెద్ద పాన్-ఇండియా స్టార్ గా పిలువబడుతున్నాడు. ప్రభాస్ తన రాబోయే చిత్రం ‘స్పిరిట్’ కోసం రూ.150 కోట్లు వసూలు చేస్తున్నాడు. ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించనున్నారు.

అక్షయ్ కుమార్

వరుసగా, వైవిధ్యమైన సినిమాలు చేస్తున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ ఇతర స్టార్స్ కంటే ముందున్నాడు. తన రాబోయే చిత్రం రామ్ సేతు కోసం 135 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. బాలీవుడ్ లో అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకునేవాళ్లలో అక్షయ్ కుమార్ రెండో స్థానంలో ఉన్నాడు. రామ్ సేతు మూవీలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరియు నుష్రత్ బరుచ్చా కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. టైగర్ ష్రాఫ్‌తో అక్షయ్ తన బడే మియాన్ చోటే మియాన్ కోసం దాదాపు 150 కోట్ల రూపాయలను తీసుకున్నట్లు బాలీవుడ్ టాక్ .

సల్మాన్ ఖాన్

బాలీవుడ్ లో కండలవీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయనకున్న మాస్ ఫాలోయింగ్ ఇతర ఏ హీరోలకు ఉండదు కూడా. ఈ బాలీవుడ్ సూపర్ స్టార్ ప్రస్తుతం తన రాబోయే ప్రాజెక్ట్ కభీ ఈద్ కభీ దీపావళి (ప్రస్తుతం భాయిజాన్ అని పేరు పెట్టారు) కోసం చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో తన పాత్ర కోసం సల్మాన్ 125 కోట్ల రూపాయలకు సైన్ చేసినట్టు సమాచారం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Akshay Kumar
  • bollywood
  • prabhas
  • salman khan
  • tollywood

Related News

I will only do such films from now on... Kajal's sensational decision.

Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. కాజల్ సంచలన నిర్ణయం

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన సినీ ప్రయాణంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా హీరోయిన్లు పెళ్లయ్యాక, తల్లి అయ్యాక సినిమాలకు దూరం అవుతుంటారు లేదా గ్లామర్ పాత్రలకే పరిమితమవుతుంటారు. కానీ, కాజల్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. మాతృత్వం పొందిన తర్వాత తన ఆలోచనా విధానంలో, కథల ఎంపికలో పూర్తి మార్పు వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. ఇకపై తాను చేసే ప

  • Shooting incident at Salman Khan's residence: Bishnoi attempts to surrender in Mumbai court.

    Gangster Lawrence Bishnoi: సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద జరిగిన కాల్పుల ఘటన ప్రధాన సూత్రధారి బిష్ణోయ్ ముంబై కోర్టులో లొంగిపోవడానికి ప్రయత్నించాడు.

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd