HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Toor Dal Price Hike

Toor Dal Price : ఇక వంటిట్లో కందిపప్పు కష్టమే..

సామాన్య ప్రజలను ఏవస్తువు వదిలిపెట్టడం లేదు..ఎక్కడ కూడా తగ్గేదెలా అంటూ ధరల మోత మోగిస్తున్నాయి

  • Author : Sudheer Date : 01-09-2023 - 11:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Toor Dal
Toor Dal

ఏం కొనేటట్లు లేదు.. ఏం తినేటట్లు లేదు.. ఈ పాట మనం అందరం ఏన్నో సార్లు వినుంటాం. అయితే.. ప్రస్తుతం ప్రజల పరిస్థితి అలానే మారింది. సామాన్య ప్రజలను ఏవస్తువు వదిలిపెట్టడం లేదు..ఎక్కడ కూడా తగ్గేదెలా అంటూ ధరల మోత మోగిస్తున్నాయి. మొన్నటి వరకు టమాటా ధరలు ఆకాశానికి అంటగా..ఇప్పుడు కందిపప్పు నేను కూడా అంతే అంటూ డబుల్ సెంచరీకి వెళ్తుంది. కందిపప్పు వల్ల… జీర్ణక్రియ మెరుగవుతుంది, మలబద్ధకం సమస్య తీరుతుంది, గుండెకు సంబంధించిన సమస్యల్ని కందిపప్పు నివారిస్తుంది… గుండెకు వ్యాధులు రాకుండా కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు చెపుతుంటారు. దీంతో మారే ఏ పప్పుకు లేని డిమాండ్ కందిపప్పును ఏర్పడుతుంది. దీంతో కందిపప్పు (Toor Dal) ధర రోజు రోజుకు పెరుగుతుంది. అసలు డైలీ కందిపప్పు తినేవారు కూడా ఉన్నారు. ఇలాంటి ఈ సమయంలో కందిపప్పు ధర పెరుగుతుండడం సామాన్య ప్రజలను గగ్గోలు పెట్టిస్తుంది.

Read Also : CM KCR: ఎన్నికలే లక్ష్యంగా కేసీఆర్ దూకుడు, వీవోఏలకూ వరాలు

ఏపీ (AP)లో గత 8 నెలల్లో కందిపప్పు ధర 55 శాతం ధర పెరిగింది. ప్రస్తుతం కిలో రూ. 160-170 మధ్య పలుకుతుండగా, బ్రాండెడ్ కందిపప్పును రూ. 180కిపైనే విక్రయిస్తున్నారు. మున్ముందు ధర రూ. 200 దాటే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. సాగు తగ్గడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. ఒక్క ఏపీలోనే కాదు అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. ఈ ఏడాది జనవరిలో కిలో కందిపప్పు (Toor Dal Price) ధర రూ. 98 నుంచి రూ.110 వరకు ఉంది. ఆగస్టులో రూ. 170కి చేరుకుంది. అంటే గత 8 నెలల్లో 55 శాతం పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో గరిష్ఠంగా 8.50 లక్షల ఎకరాల్లో కందిపప్పు సాగుచేసేవారు. గతేడాది ఇది 6 లక్షల ఎకరాలకు పడిపోయింది. ఈ పంట ద్వారా 1.09 లక్షల టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా వేయగా, వర్షాల కారణంగా దిగుబడులు పడిపోయాయి.

Read Also:  IT Notice : చంద్రబాబు కు ఐటీ నోటీసులు..?

మరోవైపు, ఈ ఏడాది కందిసాగు దారుణంగా పడిపోయింది. ఆగస్టు నెలాఖరు నాటికి 292 లక్షల ఎకరాల్లోనే సాగు చేశారు. దేశవ్యాప్తంగానూ కంది సాగు గణనీయంగా తగ్గడం కూడా ధరల పెరుగుదలకు కారణంగా మార్కెట్ వర్గాలు చెపుతున్నాయి. ఏది ఏమైనప్పటికి కందిపప్పు ధర రోజు రోజుకు పెరగడం అనేది సామాన్య ప్రజలను కన్నీరు పెట్టిస్తుంది. టమాటా విషయంలో ఎలాగైతే సబ్సిడీ ఇచ్చి ఆదుకున్నారో..కందిపప్పు విషయంలో కూడా అలాగే చేయాలనీ ప్రభుత్వాలను సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • Toor Dal
  • Toor Dal price
  • Toor Dal price hike

Related News

Avinash Reddy faces setback in Supreme Court

వెంటనే లొంగిపోవాలి .. అవినాష్‌రెడ్డికి సుప్రీంకోర్టు ఆదేశాలు

దేశ అత్యున్నత న్యాయస్థానం అవినాష్‌రెడ్డి విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ ఆయనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.

  • Konidela Village

    కొణెదల పేరుతో గ్రామం..రూ.6 కోట్లను మంజూరు చేసిన పవన్ కళ్యాణ్

  • Nara Lokesh Blackbuck

    Job Calendar : ఉగాదికి జాబ్ క్యాలెండర్ – మంత్రి లోకేశ్

Latest News

  • Vijay – Rashmika Love Journey : విజ‌య్ ర‌ష్మికల ల‌వ్ జ‌ర్నీ ఎలా మొదలైందంటే !!

  • Vrusha Karma : చీకటి గుహలో చైతూ వేట

  • Social Media : 10 కోట్ల ఫాలోవర్లతో ఇన్స్టాలో మోదీ రికార్డ్

  • గుడ్ న్యూస్‌.. గాలి లేకుండానే నడిచే టైర్!!

  • SA vs WI మ్యాచ్‌లో ఎవరి గెలుపు భారత్‌కు ముఖ్యం?

Trending News

    • కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం.. కార‌ణ‌మిదే?!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భార‌త్‌కు సౌతాఫ్రికా సాయం చేయ‌నుందా?

    • Save Punarvika : పునర్వికకు పునర్జన్మ.. రూ.16 కోట్లు అందజేసిన దాతలు

    • మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడిందా? అయితే ఇలా చేయండి!

    • సుదీర్ఘ నిరీక్షణకు తెర .. కేరళ ఇక పై ‘కేరళం’.. పేరు మార్పుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd