Tomatoes Vehicle Robbed : కారులో వచ్చి.. 2000 కిలోల టమాటాల లోడ్ లూటీ
Tomatoes Vehicle Robbed : టమాటా ధరల సంక్షోభం మరింత ముదురుతోంది. కూరగాయల మార్కెట్‌కు టమాటాలను రవాణా చేస్తున్న ఒక వాహనాన్ని కొందరు లూటీ చేశారు.
- By Pasha Published Date - 12:27 PM, Mon - 10 July 23
Tomatoes Vehicle Robbed : టమాటా ధరల సంక్షోభం మరింత ముదురుతోంది.
టమాటాను కొనేందుకు సామాన్యులు జంకుతున్నారు..
ప్రస్తుతం కిలో టమాటా ధర రూ.120 నుంచి రూ.150 దాకా ఉంది..
ఈనేపథ్యంలో కూరగాయల మార్కెట్‌కు టమాటాలను రవాణా చేస్తున్న ఒక వాహనాన్ని కొందరు లూటీ చేశారు.
టమాటాలన్నీ ఎత్తుకుపోయారు..
ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో ఉన్న చిక్కజాల ఏరియాలో చోటుచేసుకుంది. చిత్రదుర్గలోని హిరియూరు పట్టణం నుంచి కోలార్ సిటీలోని కూరగాయల మార్కెట్‌కు 2,000 కిలోల టమాటాలను తరలిస్తున్న వాహనాన్ని గుర్తు తెలియని దుండగులు దోచుకున్నారు. జూలై 8న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఒక కిలో టమాటా ధర కర్ణాటకలో రూ.150 దాకా ఉంది. ఈ లెక్కన 2000 కిలోల టమాటా కాస్ట్ రూ. 3లక్షలు అవుతుంది. ఈ టమాటాలను మార్కెట్ కు తరలిస్తున్న రైతు లబోదిబో అంటూ గుండెలు బాదుకుంటున్నాడు. ఈ లూటీ వల్ల తనకు 3 లక్షల లాస్ జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
Also read : Mother Runs Car Over Daughter : బిడ్డపై నుంచి కారు నడిపిన తల్లి.. పసికందు మృతి
“ముగ్గురు దుండగులు కారులో వచ్చి.. టమాటాల లోడ్ తో వెళ్తున్న మా వాహనాన్ని ఢీకొట్టారు. మా వాహనాన్ని ఆపేసి.. నాపై, వాహనం డ్రైవర్‌పై దాడి చేశారు. ఈక్రమంలో ముగ్గురు దుండగులు మా దగ్గర డబ్బులు కూడా డిమాండ్ చేశారు.. దీంతో కొంత డబ్బును వాళ్లకు ఆన్ లైన్ లో బదిలీ చేశాను.. అనంతరం టమాటాల లోడ్ ఉన్న మా వాహనాన్ని తీసుకొని(Tomatoes Vehicle Robbed).. మమ్మల్ని నడిరోడ్డుపై వదిలి వాళ్ళు పరారయ్యారు” అని బాధిత రైతు వివరించాడు. మరోవైపు పలుచోట్ల టమాటా తోటల్లోనూ చోరీలు జరుగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. దీంతో రైతులు పొలాల్లో టెంట్లు వేసుకొని కూర్చొని మరీ టమాటా పంటకు కాపలా కాస్తున్నారు.