Telangana Elections : ఓటు హక్కు వినియోగించుకున్న చిరంజీవి, అల్లు అర్జున్, రాంచరణ్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పక్రియ సజావుగా సాగుతుంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు భారీగా
- Author : Prasad
Date : 30-11-2023 - 8:15 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పక్రియ సజావుగా సాగుతుంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు భారీగా ఓటర్లు చేరుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ క్లబ్ పోలింగ్ బూత్‌లో సినీ నటులు చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, అల్లు అర్జున్, రాంచరణ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్యూలైన్లో నిలబడి తన ఓటు హక్కును చిరంజీవి కుటుంబ సభ్యులు వినియోగించుకున్నారు.సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరగనుంది. సమస్యత్మక ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగియనుంది. పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి ఒక్కరు తమ ఓటును వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు ఓటర్లను కోరుతున్నారు. కొన్ని చోట్ల ఈవీఎంలు మోరయించడంతో ఎన్నికల కమిషన్ అధికారులు ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేస్తున్నారు.