3 Capitals Bike rally : మూడు రాజధానులపై బైక్ ర్యాలీ.. కిందపడిన వైసీపీ ఎమ్మెల్యే
విశాఖపట్నంలో మూడు రాజధానులపై వైసీపీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు..
- By Prasad Published Date - 11:50 AM, Sun - 9 October 22

విశాఖపట్నంలో మూడు రాజధానులపై వైసీపీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యలీలో నర్సీపట్నం వైసీపీ ఎమ్మెల్యే పేట్ల ఉమా శంకర్ గణేష్ పాల్గొన్నారు. తన ద్విచక్ర వాహనం ర్యాలీలో వెళ్తుండగా వేరే బైక్‌ని ఢీ కొట్టింది. దీంతో ఎమ్మెల్యే గణేష్ బైక్‌పై నుంచి కింద పడిపోయారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే కాలికి గాయం కావడంతో వైజాగ్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.