Drugs : థానేలో ముగ్గురు నైజీరియన్లు అరెస్ట్.. రూ.20లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం
డ్రగ్స్ దందా రోజు రోజుకి పెరిగిపోతుంది. దేశంలో విచ్చలవిడిగా డగ్స్ ఎక్కడపడితే అక్కడ దొరుకుతున్నాయి. తాజాగా థానేలో
- By Prasad Published Date - 06:07 AM, Sun - 25 December 22

డ్రగ్స్ దందా రోజు రోజుకి పెరిగిపోతుంది. దేశంలో విచ్చలవిడిగా డగ్స్ ఎక్కడపడితే అక్కడ దొరుకుతున్నాయి. తాజాగా థానేలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురు నైజీరియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.20 లక్షలకు పైగా డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌లో 60 గ్రాముల కొకైన్, 70 గ్రాముల ఎండీ ఉన్నాయి. ఇదిలా ఉండగా మరో ఘటనలో డ్రగ్స్ వ్యాపారిని ముంబై పోలీసుల యాంటీ నార్కోటిక్స్ సెల్ ఆఫ్ ఘాట్‌కోపర్ యూనిట్ శుక్రవారం అరెస్టు చేసింది. అతని వద్ద నుంచి కొకైన్, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.28 లక్షలుగా ఉంటుందని పోలీసులు తెలిపారు.