TS Govt Key Decision : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం…ఇక ఆ ఆపరేషన్లు బంద్..!
తెలంగాణ రాష్ట్రంలోని ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మరణించిన విషయం తెలిసిందే.
- By hashtagu Published Date - 05:21 PM, Thu - 1 September 22

తెలంగాణ రాష్ట్రంలోని ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల నిబంధనల్లో సైతం మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది సర్కార్. రోజుకు కేవలం 15 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు మాత్రమే చేయాలని కొత్త నిబంధనను తీసుకువచ్చింది.