Srikalahasti Temple : శ్రీకాళహస్తి ఆలయం క్యూలైన్లో కొట్లాట… మంత్రి సమక్షంలోనే..!
శ్రీకాళహస్తి ఆలయంలో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. సూర్యగ్రహణం సందర్భంగా దర్శనానికి వెళ్లిన భక్తులు...
- By Prasad Published Date - 07:14 AM, Wed - 26 October 22

శ్రీకాళహస్తి ఆలయంలో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. సూర్యగ్రహణం సందర్భంగా దర్శనానికి వెళ్లిన భక్తులు క్యూలైన్‌లో కొట్టుకున్నారు. దర్శనానికి వెళ్లే సమయంలో మాటా మాటా పెరిగి కొట్టుకున్నారు. దీంతో క్యూలైన్‌లో గందరగోళం నెలకొంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో ఈ గొడవ జరిగింది. దీంతో ఆయన వెంటనే స్పందించి అధికారులకు ఆదేశాలిచ్చారు. రంగంలోకి దిగిన ఆలయ అధికారులు, పోలీసులు భక్తులకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే ఘటనకు గల కారణాలపై ఇంకా ఆలయ అధికారులు వివరణ ఇవ్వలేదు.