Telangana: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి నిరసన సెగ
యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. జైకేసారం గ్రామంలో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వచ్చిన ఆయనను కాంగ్రెస్, సిపిఎం నాయకులు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు.
- Author : Praveen Aluthuru
Date : 04-09-2023 - 2:56 IST
Published By : Hashtagu Telugu Desk
Telangana: యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. జైకేసారం గ్రామంలో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వచ్చిన ఆయనను కాంగ్రెస్, సిపిఎం నాయకులు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. 2 సంవత్సరాల క్రితం వేసిన శిలాఫలకం పనులకే దిక్కులేదు మళ్లీ కొత్తగా శిలాఫలకం ఎందుకు అని గ్రామస్థులు ప్రశ్నించారు.ఆయనపై కాంగ్రెస్, సిపిఎం నాయకులూ మండిపడ్డారు. అతనికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.9 సంవత్సరాలుగా రేషన్ కార్డులు మంజూరు చేయలేదని నిలదీశారు. నెల రోజుల్లో పనులు పూర్తి చేస్తానని పనులు చేయకపోతే ఎన్నికల్లో ఓట్లు అడగనని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో నిరసనకారులు ఆందోళన విరమించారు.
Also Read: CBN IT Issue : చంద్రబాబు అరెస్ట్ సాధ్యమా?