Telangana: ట్రాన్స్ జెండర్ తో సహజీవనం.. ఆపై పెళ్లి!
ట్రాన్స్ జెండర్ అంటేనే.. ఎన్నో వేధింపులు, అవమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
- By Balu J Published Date - 12:00 PM, Sat - 12 March 22
ట్రాన్స్ జెండర్ అంటేనే.. ఎన్నో వేధింపులు, అవమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకవైపు సామాజిక వేధింపులు తట్టుకుంటూనే.. మరోవైపు తమను తాము తీర్చిదిద్దుకుంటున్నారు. వైద్య, వైద్యం రంగాల్లో రాణిస్తున్నారు. లింగవివక్షతను అధిగమించి మనసుకు నచ్చిన వ్యక్తులతో ఏడడుగులు వేస్తున్నారు. తాజాగా తెలంగాణకు చెందిన ఓ యువకుడు ట్రాన్స్‌జెండర్‌ను వివాహం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే భూపాలపల్లికి చెందిన రూపేష్ అనే వ్యక్తికి ఆళ్లపల్లి మండలం అనంతోగు గ్రామానికి చెందిన అఖిల అనే ట్రాన్స్‌జెండర్‌తో మూడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. వీరిద్దరి స్నేహం ప్రేమగా మారింది. అనంతరం యెల్లందు పట్టణంలోని స్టేషన్ బస్తీలోని ఓ అద్దె ఇంట్లో మూడు నెలల క్రితం ఇద్దరూ సహజీవనం ప్రారంభించారు. ఇద్దరు తమ ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసి, వాళ్ల అంగీకారం కోసం ఒత్తిడి తెచ్చారు. ఇరువురి కుటుంబ సభ్యుల మధ్య , స్నేహితులు, బంధువుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది.