Revanth Reddy: జర్నలిస్టుల సమస్యలు, సంక్షేమంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వినతి
తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో పలువురు జర్నలిస్టులు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని సోమవారం కలిశారు.
- Author : Balu J
Date : 16-10-2023 - 6:13 IST
Published By : Hashtagu Telugu Desk
Revanth Reddy: తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో పలువురు జర్నలిస్టులు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని సోమవారం కలిశారు. తెలంగాణ జర్నలిస్టుల సమస్యలు, సంక్షేమానికి సంబంధించి 9 ప్రధాన అంశాలతో కూడిన వినతిపత్రం అందించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
అందుకు సానుకూలంగా స్పందించిన రేవంత్ రెడ్డి తగు పరిశీలనకు మేనిఫెస్టో పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక అధ్యక్షుడు బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులు కె. శ్రీనివాస్ రావు, జె. వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి సాధిక్, సహాయ కార్యదర్శి మధు, కార్యదర్శి, ట్రెజరర్ సురేష్ వెల్పుల ఉన్నారు.
Also Read: Mimoh Chakraborty: టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ హీరో కుమారుడు.. ఎవరో తెలుసా