OnlineClasses: ఆన్‌లైన్ క్లాసులపై.. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు..!
- Author : HashtagU Desk
Date : 03-02-2022 - 2:49 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణలో విద్యా సంస్థలు పునఃప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గని నేపధ్యంలో, ఈనెల ఫిబ్రవరి 20వ తేదీ వరకు ఆన్‌లైన్ క్లాసుల ద్వారా విద్యా బోధనను కొనసాగించాలని ఆదేశించింది.
పలు విద్యా సంస్థలు విద్యార్ధులకు ప్రత్యక్ష తరగతలు మొదలుపెట్టిన నేపధ్యంలో ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్‌లైన్ క్లాసులు కూడా నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే మార్కెట్లు, రెస్టారెంట్లు, ముఖ్యంగా బార్లు వద్ద కరోనా నిబంధనలు కచ్ఛితంగా అమలు చేయాలని హైకోర్టు ఆదేశించి
ఇక తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సమ్మక్క, సారక్క జాతర సమయంలో ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలని, ఈ జతరలో భాగంగా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై రెండు వారాల్లో సమగ్ర నివేదికను ఇవ్వాలని, తరుపరి విచారణను ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది.