Chandrababu Arrest: మళ్లీ సిట్ ఆఫీసుకు చంద్రబాబు.. టీడీపీ లీడర్ల ఆగ్రహం
Chandrababu Arrest : ఆదివారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో పోలీసులు చంద్రబాబును మరోసారి విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
- By Pasha Published Date - 06:31 AM, Sun - 10 September 23
Chandrababu Arrest : ఆదివారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో పోలీసులు టీడీపీ అధినేత చంద్రబాబును మరోసారి విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. దాదాపు గంటపాటు మెడికల్ టెస్టులు జరిగాయి. అనంతరం చంద్రబాబును ఏసీబీ కోర్టుకు తరలిస్తారని భావించినప్పటికీ.. మళ్లీ సిట్ కార్యాలయానికి తీసుకెళ్లారు. దీనిపై టీడీపీ శ్రేణులు పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మళ్లీ ఎందుకు తనను సిట్ కార్యాలయానికి తరలిస్తున్నారని ఈ సందర్భంగా పోలీసు అధికారులను చంద్రబాబు ప్రశ్నించారు. రిమాండ్ రిపోర్టు ఇంకా రెడీ కాకపోవడంతో మళ్లీ సిట్ కార్యాలయానికి తీసుకెళుతున్నట్లు పోలీసులు ఆయనకు సమాధానం ఇచ్చారు. దీంతో అక్కడున్న టీడీపీ నేతలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ అధినేతను కోర్టులో హజరుపర్చాలని డిమాండ్ చేశారు.