Chandra Babu : ఎన్టీఆర్ జిల్లాలో నేడు చంద్రబాబు పర్యటన.. నందిగామ, జగ్గయ్యపేటలో బహిరంగ సభ
ఎన్టీఆర్ జిల్లాలో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో జరిగే బాదుడే..
- By Prasad Published Date - 08:56 AM, Fri - 4 November 22
ఎన్టీఆర్ జిల్లాలో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో జరిగే బాదుడే బాదుడు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబు నందిగామ చేరుకోని రోడ్ షో నిర్వహించున్నారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించనున్నారు. అనంతరం సాయంత్రం ఆరుగంటలకు జగ్గయ్యపేటలో రోడ్ షో నిర్వహించి బహిరంగ సభలో పాల్గొంటారు. అధినేత పర్యటన నేపథ్యంలో నాయకులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లేందుకు సిద్ధమైయ్యారు.