Drugs : హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ట్యాక్సీ డ్రైవర్ అరెస్ట్.. డ్రగ్స్ అమ్ముతూ..!
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ట్యాక్సీ డ్రైవర్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎయిర్‌పోర్ట్ వద్ద హెరాయిన్ విక్రయిస్తూ ట్యాక్సీ డ్రైవర్
- By Prasad Published Date - 06:52 AM, Mon - 26 December 22

హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ట్యాక్సీ డ్రైవర్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎయిర్‌పోర్ట్ వద్ద హెరాయిన్ విక్రయిస్తూ ట్యాక్సీ డ్రైవర్ పట్టుబడ్డాడు. డ్రైవర్ వద్ద 48 గ్రాముల హెరాయిన్‌ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చాంద్రాయణగుట్టకు చెందిన షేక్ అబ్దుల్ ఆలం (41) ముంబైకి చెందిన సాజన్ అనే వ్యక్తి నుంచి డ్రగ్‌ను కొనుగోలు చేసి, నగరంలో డ్రగ్స్‌కు బానిసైన వారికి విక్రయించాలని ప్లాన్ చేశాడు. నిందితుడు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నాడని, అందుకే డబ్బు సంపాదించడానికి అక్రమ వ్యాపారం వైపు మొగ్గు చూపాడని RGI ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) ఆర్ శ్రీనివాస్ తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (మాదాపూర్) ఆర్‌జిఐ ఎయిర్‌పోర్ట్ పోలీసు అధికారులతో కలిసి ఉచ్చు బిగించి అరెస్టు చేశారు. అతనిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.