Supreme Court: ఫైబర్ నెట్ కేసులో విచారణ, జనవరి 17కి వాయిదా
ఫైబర్ నెట్ కేసు విచారణను సుప్రీంకోర్టు జనవరి 17కి వాయిదా వేసింది.
- By Balu J Published Date - 03:38 PM, Tue - 12 December 23

Supreme Court: ఫైబర్ నెట్ కేసు విచారణను సుప్రీంకోర్టు జనవరి 17కి వాయిదా వేసింది. ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 17ఏపై తీర్పు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో.. పలుమార్లు విచారణ వాయిదా పడింది. ఫైబర్‌నెట్ కేసు ఈరోజు సుప్రీంకోర్టులో జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేల ఎం. త్రివేదిలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తీర్పు 17 A న ఇవ్వాల్సి ఉన్నందున జనవరి 17కి వాయిదా పడింది. ఫైబర్‌నెట్ కేసుపై చంద్రబాబు మాట్లాడటం మానేయాలని ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది రంజిత్ కుమార్ విజ్ఞపతి కోరారు. మాట్లాడటం లేదని చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా స్పష్టం చేశారు. ఈ కేసుపై ఎవరు మాట్లాడారో అఫిడవిట్ దాఖలు చేయాలని ఇరుపక్షాల న్యాయవాదులను ఆదేశించిన సుప్రీంకోర్టు, ఇరుపక్షాలు సంయమనం పాటించాలని సూచించింది.