AP Schools: ఏపీలో వేసవి సెలవులు పొడిగింపు
- Author : Balu J
Date : 09-06-2024 - 11:03 IST
Published By : Hashtagu Telugu Desk
AP Schools: రాష్ట్రంలో వేసవి సెలవులను ఈనెల 12 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం 12న పాఠశాలలు పున:ప్రారంభం కావాల్సి ఉండగా 13న రీఓపెన్ అవుతాయని వెల్లడించింది. 12న CMగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించాలని పలు ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం సెలవులను మరోరోజు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తన ప్రమాణస్వీకారం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్ డీఏ ముఖ్యమంత్రులతో పాటు జాతీయ స్థాయి నాయకులు హాజరవుతారని సమాచారం. అందుకు తగ్గట్టుగానే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన జనసేన పార్టీకి కీలక మంత్రి పదవులు దక్కుతాయని సమాచారం