Suicide : సిరిసిల్లలో విషాదం.. ఆత్మహత్య చేసుకున్న తల్లి, కొడుకు
తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి, అతని తల్లి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం
- By Prasad Published Date - 01:17 PM, Mon - 16 January 23

తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి, అతని తల్లి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో తల్లిదండ్రుల ఇంటి నుంచి భార్య ఇంటికి రాకపోవడంతో మనస్తాపానికి గురైన వ్యక్తి తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. కొడుకు ఆత్మహత్యతో దిగ్భ్రాంతి చెందిన అతని తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వేములవాడ మండలం చెక్కపల్లిలో చోటుచేసుకుంది. కొండవేని మల్లవ్వ (55), ఆమె కుమారుడు కనకయ్య (30) ఇంట్లో సీలింగ్‌కు ఉరివేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.