Mumbai : ముంబైలోని మలాడ్‌లో విషాదం.. కబడ్డీ ఆడుతూ మృతి చెందిన విద్యార్థి
ముంబైలోని మలాద్ ప్రాంతంలో విషాదం నెలకొంది. కబడ్డీ ఆడుతూ 20 ఏళ్ల విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటనపై అక్కడ ఉన్న
- By Prasad Published Date - 07:03 AM, Sat - 11 February 23

ముంబైలోని మలాద్ ప్రాంతంలో విషాదం నెలకొంది. కబడ్డీ ఆడుతూ 20 ఏళ్ల విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటనపై అక్కడ ఉన్న వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే విద్యార్థి మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు కీర్తిరాజ్ మల్లన్ అనే వ్యక్తి మలాడ్‌లోని ఓ కళాశాలలో నిర్వహిస్తున్న కబడ్డీ మ్యాచ్ ఆడుతుండగా.. ఒక్కసారిగా నేలపై పడిపోయాడని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శతాబ్ది ఆసుపత్రికి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఇతర విద్యార్థులు తీసిన వీడియో ఆధారంగా తదుపరి విచారణ జరుపుతున్నారు. కీర్తిరాజ్ మల్లన్ ముంబైలోని సంతోష్ నగర్ నివాసి, గోరేగావ్‌లోని వివేక్ కాలేజీలో బికామ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.