Maharashtra : మహారాష్ట్రలో విషాదం.. స్కూల్ గోడ కూలి బాలుడు మృతి
మహారాష్ట్రలోని థానే జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని భివాండిలో పాఠశాల కాంపౌండ్ వాల్ మార్బుల్ స్లాబ్ పడి 4..
- By Prasad Published Date - 06:43 AM, Sun - 4 December 22

మహారాష్ట్రలోని థానే జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని భివాండిలో పాఠశాల కాంపౌండ్ వాల్ మార్బుల్ స్లాబ్ పడి 4 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. తావ్రే కాంపౌండ్ ప్రాంతంలోని పాఠశాల సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చిన్నారిని ఆనంద్ కుష్వాహగా పోలీసులు గుర్తించారు. ఈ సమయంలో పాఠశాల వద్ద బాలుడు ఆడుకుంటుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే బాలుడిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.