G20 Dinner: జి20 విందులో మోడీతో స్టాలిన్.. దోస్తీ కుదిరిందా?
న్యూఢిల్లీలో జరిగిన జి20 విందుకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హాజరయ్యారు. దక్షిణ భారతదేశం నుండి తమిళనాడు ముఖ్యమంత్రి మాత్రమే విందుకు హాజరవ్వడం గమనార్హం
- Author : Praveen Aluthuru
Date : 10-09-2023 - 12:14 IST
Published By : Hashtagu Telugu Desk
G20 Dinner: న్యూఢిల్లీలో జరిగిన జి20 విందుకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హాజరయ్యారు. దక్షిణ భారతదేశం నుండి తమిళనాడు ముఖ్యమంత్రి మాత్రమే విందుకు హాజరవ్వడం గమనార్హం. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన ఫోటోలను స్టాలిన్ తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకున్నారు. దీంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. కొందరు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఇది అధికారిక సమావేశమని డిఎంకె చెబుతుండగా, కేంద్రంతో దోస్తీ కుదిరందని కొందరు భావిస్తున్నారు.
కేరళ ముఖ్యమంత్రి, కర్నాటక ముఖ్యమంత్రి మాదిరిగా స్టాలిన్ కూడా ఈ విందుకు దూరంగా ఉండాల్సిందని అభిప్రాయాలూ వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తమిళనాడు ప్రజలకుడీఎంకే వివరణ ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు. అయితే స్టాలిన్ మద్దతుదారులు అనేక మంది ముఖ్యమంత్రి అంతర్జాతీయ దౌత్య సమావేశానికి హాజరయ్యారని, పరిపాలనాపరమైన మరియు అధికారిక కారణాల వల్లే పాల్గొనడం జరిగిందని చెబుతున్నారు. చెన్నైకి చెందిన డిఎంకె నాయకుడు షెంథిల్‌నాథన్ మాట్లాడుతూ, అంతర్జాతీయ భాగస్వామ్యం ఉన్నందున ముఖ్యమంత్రి ఈ సమావేశానికి హాజరయ్యారు. తమిళనాడు ప్రగతిశీల రాష్ట్రమని, మన రాష్ట్రాన్ని మనం సరిగ్గా ప్రదర్శించాలని పేర్కొన్నారు.
Attended the #G20Dinner at Kaveri Table hosted by Hon'ble President of India @rashtrapatibhvn. @POTUS @narendramodi pic.twitter.com/AbT5PenVru
— M.K.Stalin (@mkstalin) September 10, 2023
Also Read: PV Ramesh Statement : ఆ రిటైర్డ్ ఐఏఎస్ స్టేట్మెంట్ తో ‘స్కిల్ స్కాం’లో కీలక మలుపు.. అందులో ఏముంది ?