Srivari Salakatla Brahmotsavam : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల షెడ్యూల్ ఇదే..
Srivari Salakatla Brahmotsavam : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 18 నుంచి 26 వరకు జరగనున్నాయి.
- By Pasha Published Date - 07:32 AM, Sun - 3 September 23
Srivari Salakatla Brahmotsavam : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 18 నుంచి 26 వరకు జరగనున్నాయి. ఈ వేడుకకు అంకురార్పణ సెప్టెంబరు 17న జరగనుంది. సెప్టెంబరు 12న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. వాహనసేవలు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు జరుగుతాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల షెడ్యూల్ ను టీటీడీ ప్రకటించింది.
Also read : Best Juices: మీరు బరువు తగ్గాలని చూస్తున్నారా.. అయితే ఈ జ్యూస్ ట్రై చేయండి..!
- సెప్టెంబర్ 17న అంకురార్పణ, విశ్వక్సేన ఆరాధన ఉంటాయి.
- 18న ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది.
- 19న ఉదయం చిన శేష వాహన కార్యక్రమం, రాత్రి 7 గంటలకు హంస వాహనంపైన శ్రీవారి ఊరేగింపు ఉంటుంది.
- 20న ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యాల పందిరి వాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనమిస్తారు.
- 21న ఉదయం కల్పవృక్ష వాహనం, సాయంత్రం సర్వ భూపాల వాహనంపై శ్రీవారి మాడవీధుల్లో ఊరేగింపు జరుగుతుంది.
- 22న శ్రీవారు మోహిని అవతారంలో దర్శనమిస్తారు. సాయంత్రం గరుడ వాహనంపైన ఊరేగుతారు.
- 23న ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం గజ వాహనంపైన శ్రీవారు దర్శనమిస్తారు.
- 24న ఉదయం సూర్యప్రభ వాహనం, సాయంత్రం చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిస్తూ మాడవీధుల్లో ఊరేగుతారు.
- 25న రథోత్సవం ఉంటుంది. సాయంత్రం అశ్వవాహనం పై ఊరేగింపు జరుగుతుంది.
- ఈనెల 26న శ్రీవారి పల్లకీ ఉత్సవం జరుగనుండగా, చక్ర స్నానం, ధ్వజారోహనతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
Also read :Rajanala : చెడు అలవాటు కోసం రాజనాల చేసిన పని.. ఒక మంచి కార్యానికి దారి తీసింది..
Related News
TTD: 2024 మే 16న తిరుపతిలో వార్షిక ఉత్సవాలు ప్రారంభం
TTD: తిరుపతి శ్రీగోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ఉదయం 8.15 గంటల నుంచి 8.40 గంటల వరకు పవిత్ర మిథున లగ్నంలో వేదపండితుల మంత్రోచ్ఛారణలు, సంగీత వాయిద్యాల మధ్య గరుడ ధ్వజపథం ఎగురవేయడంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. పూర్వం శ్రీ గోవిందరాజస్వామి, గరుడ ధ్వజపథం, చక్రత్తాళ్వార్, పరివార దేవతలు బంగారు తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో ప్రదక్షిణలు చేశారు. ఉదయం ఉత్సవ దేవతలకు స్నపన �