Sonia Gandhi : నేడు ఈడీ విచారణకు హాజరుకానున్న సోనియా గాంధీ
నేషనల్ హెరాల్డ్ కేసులో మరోసారి ఈడీ విచారణకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ హాజరుకానున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు
- By Prasad Published Date - 08:45 AM, Tue - 26 July 22

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో మరోసారి ఈడీ విచారణకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ హాజరుకానున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు రానున్నారు. జూలై 21న ఢిల్లీ ప్రధాన కార్యాలయంలో ఈడీ ఆమెను గంటల తరబడి ప్రశ్నించింది. జూలై 25న మళ్లీ హాజరుకావాలని సోనియా గాంధీకి తొలుత సమన్లు అందగా, ఆమె అభ్యర్థన మేరకు దానిని జూలై 26కి మార్చారు.
మంగళవారం ఆమెను అదనపు డైరెక్టర్ మోనికా శర్మ నేతృత్వంలోని బృందం విచారించనుంది. జూలై 21న సోనియా గాంధీతో పాటు ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా ఉన్నారు. ఐదు రోజుల ప్రశ్నోత్తరాల సమయంలో రాహుల్ గాంధీని అడిగిన ప్రశ్నలనే ఆమెను అడిగారని కాంగ్రెస్ అగ్ర నాయకులు తెలిపారు.