Sonia Gandhi : సోనియా గాంధీకి స్వల్ప అస్వస్థత
Sonia Gandhi : కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.
- By Pasha Published Date - 11:51 AM, Sun - 3 September 23
Sonia Gandhi : కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. స్వల్ప జ్వరంతో ఆమె బాధపడుతున్నట్టు వైద్యులు తెలిపారు. ఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్‌లో ఆమె చేరారు. సోనియా ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన పడాల్సిన పనిలేదని డాక్టర్లు స్పష్టం చేశారు. కొద్దిసేపటి కోసం అబ్జర్వేషన్‌లో ఉంచామని చెప్పారు.
Also read : 4 Year Girl – Leopard : నాలుగేళ్ల పాపను లాక్కెళ్లిన చిరుత.. ఏమైందంటే.. ?
ఈ ఏడాదిలో ఇంతకుముందు రెండుసార్లు సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరారు. వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ చికిత్స కోసం ఆమె జనవరి 12న ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. జనవరి 17న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 2023 మార్చి 2న జ్వరం కారణంగా సోనియా గాంధీ (Sonia Gandhi) మళ్లీ అదే ఆసుపత్రిలో చేరారు. ఇటీవల ఆగస్టు 31న ముంబైలో జరిగిన ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి సమావేశానికి కూడా సోనియా హాజరయ్యారు.