Gopalganj Accident: బీహార్‌లో ఆర్మీ వెహికిల్ ప్రమాదం: ఇద్దరు జవాన్లు మృతి
బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో సైనికులు ప్రయాణిస్తున్న బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఇద్దరు జవాన్లు మృతి చెందగా డజనుకు పైగా సైనికులు గాయపడ్డారు. ఈ ఘటన సిధ్వాలియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్హిమా మలుపు దగ్గర జరిగింది
- By Praveen Aluthuru Published Date - 01:50 PM, Sun - 28 April 24

Gopalganj Accident: బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో సైనికులు ప్రయాణిస్తున్న బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఇద్దరు జవాన్లు మృతి చెందగా డజనుకు పైగా సైనికులు గాయపడ్డారు. ఈ ఘటన సిధ్వాలియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్హిమా మలుపు దగ్గర జరిగింది. ప్రమాదం అనంతరం క్షతగాత్రులందరినీ చికిత్స నిమిత్తం సదర్ ఆస్పత్రికి తరలించారు.
వీరిద్దరి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు.
We’re now on WhatsApp. Click to Join
ఆదివారం సుపాల్‌లో ఎన్నికల నిర్వహణకు వెళ్తున్న సైనికుల బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. గోపాల్‌గంజ్ పోలీస్ లైన్ కాంప్లెక్స్ నుండి మూడు బస్సుల్లో 242 మంది సైనికులు సుపాల్‌కు వెళ్తున్నట్లు సమాచారం. బస్సు బర్హిమా మలుపు సమీపంలో NH 27 హైవేపై ఉన్న హోటల్ వద్ద బోజానం కోసం ఆపారు. కొందరు జవాన్లు బస్సు దిగగా మరికొందరు బస్సులోనే ఉండిపోయారు. ఇంతలో బస్సును వెనుక నుంచి ఓ ట్రక్కు బలంగా ఢీకొట్టింది. మరణించిన సైనికుల్లో పవన్ మహతో, అశోక్ ఓరాన్ ఉన్నారు. సమాచారం మేరకు పెద్ద సంఖ్యలో స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.
Also Read: Ram Charan : కమల్, రజినితో పాటు ఒకే స్టేజిపై కనిపించబోతున్న రామ్ చరణ్..