Heart Attack: గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
తాజాగా ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువకుడు గుండెపోటుతో చనిపోయాడు.
- By Balu J Published Date - 04:15 PM, Sat - 11 March 23

యువత గుండెపోటు సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల చాలామంది ఆస్పత్రుల పాలు కాగా, కొందరు చనిపోయారు కూడా. తాజాగా ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువకుడు గుండెపోటు కారణంగా చనిపోయాడు. ఖమ్మం జిల్లా మధిర మండలానికి చెందిన మురళి క్రిష్ట కు హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం వచ్చింది.
అయితే ఈ మధ్య హైదరాబాద్ కు వచ్చిన మురళి తన స్నేహితులతో సినిమాకు వెళ్లాడు. అయితే సినిమా చూస్తుండగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్నేహితులు సీపీఆర్ చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆస్పత్రికి తరలించేలోపే చనిపోయాడు. మురళి వయసు 36 మాత్రమే. యువకుడి మరణంతో స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Related News

Manchu Family: రచ్చకెక్కిన ‘మంచు’ కుటుంబం.. విష్ణు దాడి చేసిన వీడియోను షేర్ చేసిన మనోజ్!
విష్ణు, మనోజ్ మధ్య గ్యాప్ ఏర్పడిందా? అంటే అవుననే సమాధానం ఇస్తున్నాడు మంచు మనోజ్.