Suicide : నరసరావుపేటలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
పల్నాడు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని నాదెండ్ల మండలం సాతులూరు గ్రామం వద్ద ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రైలు
- By Prasad Published Date - 08:30 AM, Tue - 14 November 23

పల్నాడు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని నాదెండ్ల మండలం సాతులూరు గ్రామం వద్ద ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలానికి చెందిన గంగిరెడ్డి (34)గా పోలీసులు గుర్తించారు. ఆదివారం రైల్వే ట్రాక్‌పై అతని మృతదేహాన్ని ప్రభుత్వ రైల్వే పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న గంగిరెడ్డి కొంతకాలంగా క్రికెట్ బెట్టింగ్‌లకు బానిసయ్యాడని.. బెట్టింగ్‌లో భారీగా డబ్బులు పోగ్గొట్టుకుని నష్టపోయాడని పోలీసులు తెలిపారు.అయితే అప్పులు ఇచ్చిన వారు తమ అప్పులు తీర్చాలంటూ ఒత్తిడి పెరగడంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై ప్రభుత్వ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Also Read: ndia vs New Zealand : భారత్, కివీస్ సెమీస్‌కు కౌంట్‌డౌన్.. హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయంటే ?
Related News

AP : సిహెచ్ ఓలు వెంటనే ఆందోళన విరమించాలని కోరిన వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
సహేతుకం కాని డిమాండ్లతో ఆందోళన చేస్తున్న సామాజిక ఆరోగ్యాధికారులు (CHOs/MLHPs) వెంటనే తమ ఆందోళనను