Singireddy: బీఆర్ఎస్ విజయం తెలంగాణ అమరవీరులకు అంకితం
- By Balu J Published Date - 04:04 PM, Sun - 2 June 24

Singireddy: మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సందర్బంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దం పూర్తయిందని, జూన్ 2 రాష్ట్ర ప్రజానీకానికి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అని తెలియజేశారు. బి ఆర్ ఎస్ పార్టీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో అద్భుతమైన మెజారిటీ తో గెలిచిందని, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఎంపిటిసి, జెడ్పిటిసి, కౌన్సిలర్ లకు శుభాకాంక్షలు తెలిపారు మాజీ మంత్రి సింగిరెడ్డి.
ఈ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితం ఇస్తున్నాం. ఉమ్మడి జిల్లా నుండి మా అధినేత కేసీఆర్కి మేము ఇచ్చే కానుక. నవీన్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ గెలుపు కొత్త బాట కు దారి తీస్తుంది. పార్టీ ల పరంగా ఎన్నికైన వాళ్లే ఈ ఎన్నికల్లో ఓటు వేసేది. సుమారు 1000 పైగా బి ఆర్ ఎస్ పార్టీ కి చెందిన వారు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. గతంలో ఈ రెండు స్థానాల్లో బీఆర్ఎస్ తరపున ఇద్దరు ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. కసిరెడ్డి నారాయణరెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది అని సింగిరెడ్డి అన్నారు.