Ind vs SI: భారత్ దే సిరీస్
సొంతగడ్డపై భారత క్రికెట్ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇటీవలే వెస్టిండీస్ పై టీ ట్వంటీ, వన్డే సిరీస్ లను గెలుచుకున్న భారత్ తాజాగా శ్రీలంకపైనా షార్ట్ ఫార్మేట్ లో సిరీస్ కైవసం చేసుకుంది.
- Author : Hashtag U
Date : 26-02-2022 - 11:40 IST
Published By : Hashtagu Telugu Desk
సొంతగడ్డపై భారత క్రికెట్ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇటీవలే వెస్టిండీస్ పై టీ ట్వంటీ, వన్డే సిరీస్ లను గెలుచుకున్న భారత్ తాజాగా శ్రీలంకపైనా షార్ట్ ఫార్మేట్ లో సిరీస్ కైవసం చేసుకుంది. ధర్మశాల వేదికగా జరిగిన రెండో టీ ట్వంటీలో 7 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ కు దిగిన శ్రీలంకకు ఓపెనర్లు మంచి ఆరంభాన్నిచ్చారు. గుణలతిక , నిస్సాంక తొలి వికెట్ కు 67 పరుగులు జోడించారు. మిడిలార్డర్ బ్యాటర్లు తక్కువ స్కోరుకే వెనుదిరిగినా… నిస్సాంకకు తోడుగా కెప్టెన్ శనక మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో లంక భారీ స్కోరే సాధించింది. కెప్టెన్ శనక కేవలం 19 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేశాడు. నిస్సాంక 75 , గుణలతిక 38 పరుగుల చేశారు. దీంతో శ్రీలంక 20 ఓవర్లలో 5 వికెట్లకు 183 పరుగులు చేసింది.
ఛేజింగ్ లో ఈ సారి భారత్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది.రోహిత్ శర్మ 1 , ఇషాన్ కిషన్ 16 పరుగులకే ఔటవగా.. ఈ దశలో శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్ మెరుపు బ్యాటింగ్ తో మ్యాచ్ ను వన్ సైడ్ గా మార్చేశారు. అయ్యర్ కేవలం 44 బంతుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 74 పరుగులు చేయగా… శాంసన్ 39 రన్స్ కు ఔటయ్యాడు. తర్వాత జడేజా చెలరేగిపోవడంతో భారత్ 17.1 ఓవర్లలోనే టార్గెట్ ను ఛేదించింది. జడేజా కేవలం 18 బంతుల్లోనే 7 ఫోర్లు, 1 సిక్సర్ తో 45 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్ ల సిరీస్ ను 2-0 తో కైవసం చేసుకుంది. సిరీస్ లో మూడో మ్యాచ్ ఆదివారం ధర్మశాలలోనే జరుగుతుంది.
Pic Courtesy- BCCI/Twitter
11th T20I win on the bounce for #TeamIndia 👏👏@Paytm #INDvSL pic.twitter.com/zsrm3abCls
— BCCI (@BCCI) February 26, 2022