HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Shreyas Iyer Rishabh Pant Help India Post 252 On Rank Turner

Pink Ball Test: బెంగళూరు టెస్టులో భారత్ 252 ఆలౌట్

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న పింక్‌బాల్ టెస్టులో భారత్ తడబడి నిలబడింది. లంక స్పిన్నర్లు రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకు ఆలౌటైంది.

  • Author : Naresh Kumar Date : 12-03-2022 - 10:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pinkball
Pinkball

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న పింక్‌బాల్ టెస్టులో భారత్ తడబడి నిలబడింది. లంక స్పిన్నర్లు రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకు ఆలౌటైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్లు శుభారంభాన్ని ఇవ్వలేకపోయారు. మయాంక్ అగర్వాల్ 4 , రోహిత్‌శర్మ 15 పరుగులకే ఔటయ్యారు. తర్వాత విహారీ, కోహ్లీ ఇన్నింగ్స్ సరిదిద్దే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 47 పరుగులు జోడించగా.. లంక స్పిన్నర్లు పుంజుకోవడంతో వెంటనే వెంటనే ఔటయ్యారు. కోహ్లీ 23 పరుగులకు ఔటవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు.

కోహ్లీ సెంచరీ చేసి మూడేళ్ళు అవుతుండడం, బెంగళూరులో అభిమానులు విరాట్ బ్యాటింగ్ చూసేందుకు ఆసక్తి చూపించడంతో టిక్కెట్లన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. అయితే కోహ్లీ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోవడంతో వారంతా నిరాశ చెందారు. ఇక ఫామ్‌లో ఉన్న రిషబ్ పంత్ టీ ట్వంటీ తరహాలో ధాటిగా ఆడి అభిమానులను అలరించాడు. 26 బంతుల్లోనే 7 ఫోర్లతో 39 పరుగులకు ఔటవగా.. జడేజా, అశ్విన్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. దీంతో భారత్ 148 పరుగులకే 6 వికెట్లు చేజార్చుకుంది. ఈ దశలో శ్రేయాస్ అయ్యర్ జట్టును ఆదుకున్నాడు. లోయర్ ఆర్డర్ బ్యాటర్లతో కలిసి స్కోర్ 250 దాటించాడు. ఎక్కువసేపు తానే స్ట్రైకింగ్ తీసుకుంటూ జాగ్రత్తగా ఆడిన అయ్యర్ 8 పరుగుల తేడాలో సెంచరీ చేజార్చుకున్నాడు. వన్డే తరహాలో ఆడిన అయ్యర్ 98 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 92 రన్స్ చేశాడు.

బౌలర్లలో ముగ్గురు స్పిన్నర్లు సమిష్టిగా రాణించారు. లసిత్ 3 , జయవిక్రమ 3, ధవంజయ డిసిల్వా 2 వికెట్లతో భారత్‌ను కట్టడి చేశారు. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఒక మార్పుతో బరిలోకి దిగింది. స్పిన్నర్ జయంత్ యాదవ్‌ స్థానంలో అక్షర్ పటేల్ జట్టులోకి వచ్చాడు. అయితే ఇరు జట్లూ స్పిన్ వ్యూహంతోనే ఆడుతున్నాయి. పింక్ బాల్‌ అయినప్పటకీ ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్ల కాంబినేషన్‌తోనే బరిలోకి దిగాయి. వారి అంచనాలకు తగ్గట్టుగానే తొలి ఇన్నింగ్స్‌లో లంక స్పిన్నర్లు రాణించారు. ఫామ్‌లో ఉన్న భారత స్పిన్నర్లు కూడా చెలరేగే అవకాశముండడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుందని అంచనా వేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bengaluru
  • rohit sharma
  • test match
  • virat kohli

Related News

Bengaluru husband has filed a complaint against his wife for sexual harassment

భర్త తనను సుఖపెట్టడం లేదని లైంగికంగా చిత్రహింసలు పెట్టిన భార్య..

Sexual Harassment Case తన భార్య తనను లైంగికంగా వేధించడంతో పాటు మోసం చేసి, బలవంతంగా ఇంట్లోంచి గెంటేశారంటూ ఓ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఈ వేధింపుల వెనుక అత్తింటివారి ప్రమేయం కూడా ఉందని, వారు తన వైవాహిక జీవితంలో నిరంతరం జోక్యం చేసుకుంటున్నారని 37 ఏళ్ల బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సంక్లిష్టమైన వివాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

  • Rohit Sharma

    ఐపీఎల్‌లో రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. క్యాప్డ్ ప్లేయర్ అంటే ఏమిటి?!

  • Actor Prakash Raj attends ED interrogation

    Prakash Raj : ప్రకాశ్ రాజ్ ఇంట విషాదఛాయలు

  • Srh Target

    IPL 2026 : RCB కి 202 టార్గెట్ పెట్టిన SRH

Latest News

  • శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు గాయం.. సీఎస్కేతో మ్యాచ్‌కు దూరం?!

  • Renuka Chowdhury: ఇది రాజధాని రైతుల విజయం.రేణుకా చౌదరి

  • Cm Chandrababu Naidu: తల్లికి వందనంపై కీలక ప్రకటన

  • Kerala Assembly Election 2026 : యూడీఎఫ్ మేనిఫెస్టో విడుదల చేసిన తెలంగాణ సీఎం రేవంత్

  • AP Elections : 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల పట్ల సంచలన ఆరోపణలు చేసిన పరకాల

Trending News

    • Condom Shortage: భారీగా పెరగనున్న కండోమ్ ధరలు

    • అల‌ర్ట్‌.. నేటి నుంచి కీల‌క మార్పులు!

    • శ్రేయస్ అయ్యర్‌పై బీసీసీఐ జరిమానా.. గ‌తేడాది కూడా ఇదే త‌ప్పు!

    • Pemmasani Chandrasekhar: 29 వేల మంది రైతులకు జరిగిన అన్యాయం ఇది.. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

    • Capital Amaravati: ఏపీకి గుడ్ న్యూస్.. లోక్‌సభలో అమరావతి బిల్లు ఆమోదం.

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd