TTD: టీటీడీ ఆనంద నిలయం వీడియో తీసిన వ్యక్తి గుర్తింపు!
తిరుమలలో (TTD) ఆనంద నిలయం చిత్రీకరణ వాస్తవమేనని ఈవో ధర్మారెడ్డి అన్నారు.
- Author : Balu J
Date : 12-05-2023 - 4:40 IST
Published By : Hashtagu Telugu Desk
తిరుమలలో (TTD) ఆనంద నిలయం చిత్రీకరణ వాస్తవమేనని ఈవో ధర్మారెడ్డి అన్నారు. తిరుమల ఆనంద నిలయం చిత్రీకరణ వాస్తవమేనని తితిదే ఈవో ధర్మారెడ్డి (Dharma Reddy) స్పష్టం చేశారు. సీసీ (CC Camera) కెమెరాల్లో నమోదైన దృశ్యాల సాయంతో నిందితుడు కరీంనగర్‌కు చెందిన రాహుల్ రెడ్డిగా భద్రత అధికారులు గుర్తించినట్లు తెలిపారు.
ప్రత్యేక పోలీసు బృందం.. తెలంగాణలోని (Telangana) రాహుల్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. సెక్యూరిటీ సిబ్బందిని ఏమార్చి.. సదరు వ్యక్తి తెలివిగా సెల్ ఫోన్ తో (Cell Phone) లోనికి ప్రవేశించినట్లు నిర్ధరించారు. భద్రతా అధికారుల నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. మరోవైపు తిరుమలలో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడిందని వస్తున్న వార్తలు.. అవాస్తవమని ఈవో ధర్మారెడ్డి వివరణ ఇచ్చారు.
Also Read: Samantha-Vijay Love: సమంత అందాలకు విజయ్ దేవరకొండ ఫిదా, రీల్స్ వీడియో వైరల్