Samantha-Vijay Love: సమంత అందాలకు విజయ్ దేవరకొండ ఫిదా, రీల్స్ వీడియో వైరల్
సమంత అందాలకు విజయ్ దేవరకొండ మైమరచిపోయాడు. అందుకు సంబంధించిన రీల్స్ వైరల్ అవుతోంది.
- By Balu J Published Date - 03:57 PM, Fri - 12 May 23

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), సమంత హీరోహీరోయిన్స్ నటిస్తున్నమూవీ ఖుషి. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ‘నా రోజా నువ్వే’ విడుదలైంది. సమంత, విజయ్ మంచి కెమిస్ట్రీతో నటించారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రేమికులుగా అద్భుతంగా నటించారని క్రిటిక్స్ కూడా అభిప్రాయపడుతున్నారు. ఇక విజయ్ దేవరకొండ ఏసినిమా చేసినా కో స్టార్స్ తో ఫ్రెండ్లీలా, ఫన్నీగా ఉండేందుకు ఇష్టపడుతాడు. ఈ యువ హీరో సమంతతోనూ క్లోజ్ గా మూవ్ అవుతుంటాడు. ప్రస్తుతం ఖుషి సినిమాకు సంబంధించిన షెడ్యూల్ కేరళలో జరుగుతోంది.
తాజాగా విజయ్ దేవరకొండ ఖుషి సెట్స్ లో అదిరిపోయే రీల్స్ చేశాడు. సమంత (Samantha)కు తెలియకుండా రీల్స్ చేసి ఆశ్చర్యపర్చాడు. “#Kushi ఆమె అంటే మీకు ఎంత ఇష్టమో ఆమెకు చెప్పే అవకాశాన్ని ఎప్పటికీ కోల్పోలేను” అని విజయ్ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో విజయ్, సమంత అభిమానులు ఫిదా అవుతున్నారు.
కాశ్మీర్ నేపథ్యంలో సాగే ఈ మూవీకి శివ నిర్వాణ దర్శకుడు. రొమాన్స్, ట్విస్ట్ లతో సాగే ఇంటెన్స్ లవ్ స్టోరీ కూడా. సమంత అందాలకు విజయ్ దేవరకొండ మైమరచిపోయాడు. సామ్ ఖుసి సెట్స్ నుండి కొన్ని చిత్రాలను కూడా పంచుకున్నారు. బుర్ఖా ధరించి కాశ్మీర్ అందాలను ఆస్వాదించడం చూడొచ్చు. మహానటి తర్వాత విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటించిన రెండవ చిత్రం. కానీ హీరో హీరోయిన్స్ నటిస్తున్న ఫుల్ మూవీ మాత్రం ఖుషినే. ఇటీవలనే విజయ్ దేవరకొండ బర్త్ డేకు స్పెషల్ గా విష్ చేసి తమ ప్రేమను చాటుకుంది సమంత.
Also Read: Pawan Heroine: 19 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్